Kerala : ప్రముఖ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అఖిల్ భార్య మేఘ.. ఓ బస్ కండక్టర్‌తో కలిసి రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వెళ్లిపోయిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై అఖిల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎవరి మీదా ఎలాంటి నిందలు వేయడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదు.

ఈ ఘటనకు సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మేఘ రాత్రి సమయంలో నైట్‌గౌన్ ధరించి, చేతిలో సూట్‌కేసులు పట్టుకుని బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక వ్యక్తి ఆమె కోసం వేచి ఉండగా, ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డైంది.

Also Read : రాజ్యసభలో లుంగీవాలా రచ్చ: దక్షిణాది ఎంపీల తీవ్ర నిరసన!

అఖిల్ తన మంచి మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేసి, సినిమా, కంటెంట్ క్రియేషన్ మీద ఉన్న ఇష్టంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ ప్రయాణంలో తనకు సోషల్ మీడియా ద్వారా మేఘ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త పెద్దల అంగీకారంతో ఏడాది క్రితం వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. అప్పటి నుంచి మేఘ కూడా అఖిల్ చేసే వీడియోలలో తరచూ కనిపిస్తూ అందరికీ పరిచయమైంది.

అఖిల్ సెలబ్రిటీ స్టేటస్ కారణంగా ఆమె ప్రయాణాల కోసం బస్సును ఉపయోగించేది. అలా బస్సులో ప్రయాణించే సమయంలోనే ఆమెకు ఆ బస్ కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం మేఘ కనిపించకుండా పోవడంతో అఖిల్ కంగారుపడి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు నిజం బయటపడటంతో అఖిల్ ప్రపంచమే తలకిందులైనట్లయింది. అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read : రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన పనిలేదు…ఛలో రేషన్‌ ఏటీఎం…ఎక్కడో తెలుసా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.