UAE-Iran : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరాన్ కు పొరుగునే ఉన్న యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఇప్పటివరకు ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తమపై వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది.

Also Read : మెటాపై సంచలన కేసు: 29 అమెరికా రాష్ట్రాల బిగ్ యాక్షన్!

తాము ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందే గుర్తించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) ఆ దేశ ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. దేశంపై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించాయని పేర్కొంది, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అధికార వర్గాల సూచనలను పాటించాలని కోరింది. ఈ మేరకు యూఏఈ రక్షణశాఖ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేశాయి. అయితే, అమెరికా-ఇరాన్‌ల మధ్య రెండు నెలల క్రితం కుదుర్చుకున్న మధ్యంతర అవగాహన ఒప్పందం గడువు ఆగస్టు 17తో ముగిసిన వెంటనే క్షిపణి దాడుల ముప్పుపై యూఏఈ అలర్ట్‌ చేయడం గమనార్హం.

Also Read : పాక్, టర్కీలతో ఒప్పందం ఉన్నా వేస్ట్‌.. సౌదీ నౌకలపై హూతీల దాడులు.. అసలేం జరిగింది?

అయితే ఈ సందర్భంగా యూఏఈ అధికారులు మాట్లాడుతూ ‘‘అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నాం.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలవుతుంది’’ అని ఆ దేశ విదేశాంగా శాఖ ప్రకటించింది. కాగా యూఏఈ సహా గల్ఫ్ దేశాలకు చెందిన షిప్పింగ్ రూట్లపై ఇరాన్ వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా ఒక మిస్సైల్ యూఏఈ సరిహద్దు జలాల్లో పడగా, ఇంకోటి దేశంలోనే పడటం కలకలం రేపింది. తమ నౌకా మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడికి దిగిందని యూఏఈ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెలి బకాయే ఈ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఇవి ఆధారం లేని ఆరోపణలు అని, వీటివల్ల ప్రాంతీయ విశ్వాసం దెబ్బతింటుందని ఎస్మాయెలి అభిప్రాయపడ్డారు.

కాగా, ఇరాన్‌ తో ఒప్పందలు రద్దు చేసుకుంటున్నట్లు యూఏఈ ప్రకటించిన కొద్దిసేపటికే అక్కడి ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ రావడం గమనార్హం. ఇరాన్‌ మిస్సైల్ దాడికి పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని కోరింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.