Nepal Floods : నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. వరద దాటికి పెద్ద పెద్ద ఇండ్లు సైతం నేలమట్టం అయ్యాయి. అనేక నిర్మాణాలు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. కానీ, ఇంటి చుట్టూ భయంకరమైన జలప్రళయం విధ్వంసాన్ని సృష్టిస్తున్నా ఓ కుటుంబం మాత్రం ఏ మాత్రం జడుసుకోకుండా అదే ఇంట్లో ఉన్నారు. ఇంటి చుట్టు నీరు చేరుతున్న దృశ్యాలను చూస్తూ ఇంటిలోనే ఉన్నారు. అంతేకాదు అంతటి వరద సైతం ఆ ఇంటిని ఏం చేయలేకపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఓవైపు వరద ఉధృతికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు, శిథిలాలు కొట్టుకుపోయినప్పటికీ.. ఆ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా బలంగా నిలిచింది. ఇంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నప్పటికీ ఆ ఇంటికి మాత్రం ఏం కాలేదు. ఇంట్లో ఉన్నవారు కూడా మాకు ఏం కాదు అన్నంత ధీమాగా కనిపించారు. అంతటి వరదలోనూ ఇంట్లో ఉన్న కుటుంబం ప్రాణాలతో బయటపడిన విషయం ఇపుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : విశాఖలో దారుణం..భార్య పిల్లలకు విషమిచ్చి… తాను ఉరివేసుకుని..

వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు తమ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఇంటి చుట్టూ వరద నీరు భయంకరంగా వేగంగా ప్రవహిస్తూ ఒక్కసారిగా దూకింది. బురదతో నిండిన వరద ప్రవాహం వేగంగా దూసుకు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టింది. నీటి మార్గంలో ఉన్న పలు నిర్మాణాలు, అడ్డు వచ్చిన చెట్లు, ఇతర నిర్మణాలు పూర్తిగా వరద దాటికి కొట్టుకుపోయాయి. అయితే వరద ప్రవాహం ఇంటికి అత్యంత సమీపంగా వచ్చినప్పటికీ.. ఆ కుటుంబం మాత్రం ఏమాత్రం బయపడకుండా సురక్షితంగా బయటపడింది. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆ ఇల్లు మాత్రం పెద్దగా నష్టం లేకుండా నిలబడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరూ కూడా ఆ ఇంటిని కట్టిందేవరో కానీ వారిక దండం పెట్టాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Also Read : చెప్పాల్సిదంతా నిన్ననే చెప్పా..కొత్తగా చెప్పాల్సిందేం లేదు..కొండా సురేఖ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.