
Bullion Market : రక్షబంధన్ అనగానే అన్నచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకుంటారు. అలాంటి శుభమైన రోజున మరో శుభవార్త అందరికీ సంతోషాన్ని తెచ్చి పెట్టింది. అదేంటంటే ఈ రోజున బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఒక గొప్ప ఊరటనే అని చెప్పాలి. అదేంటంటే గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుదల రేటును నమోదు చేస్తూ వస్తున్న బంగారం, వెండి ధరలు రాఖీ పండుగ రోజున ఒక్కసారిగా దిగువకు పడిపోయాయి. దాదాపు 20 రోజులుగా ఊహించని విధంగా పెరుగుతూ సామాన్యులకు అందకుండా పరుగెట్టిన బంగారం ధరలు తిరిగి అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున అందులోనూ శ్రావణ శుక్రవారం రోజున బంగారం కొనాలనుకుంటే ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించి కొనడం మంచిది.
Also Read : నేపాల్లో తొలగని వరద ముప్పు.. మళ్లీ పెను ప్రమాదం పొంచి ఉందా?
ఆగస్టు 28న రాఖీ పండుగ సందర్భంగా బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. ఆగస్టు 27తో పోలిస్తే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.316 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప తదితర ప్రధాన పట్టణాల్లో స్వచ్చమైన బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 982గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 650గా కొనసాగుతోంది.
ఇక వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 28, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గడం గమనార్హం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 60వేలుగా కొనసాగుతోంది అంటే గ్రాము దాదాపు రూ.260 పలుకుతుందన్న మాట.
Also Read : శ్రీశైలం సత్రంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!









