
Prakasam : ఇరుముడి సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఓ టీచర్.. స్పెషల్ క్లాసులు అంటూ లేడీ స్టూడెంట్స్‌ను మభ్యపెట్టి, ఓ ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లి అప్పగిస్తూ ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ ఘటన కూడా అదే సీన్‌ను గుర్తు చేస్తోంది. కాకపోతే ఆ సినిమాలో టీచర్ అయితే.. ఇక్కడ హాస్టల్లో పనిచేసే వంట మనిషి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీకి చెందిన కొందరు విద్యార్థినులను హాస్టల్ వంట మనిషి మభ్యపెట్టి ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆ వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : కల్కి భగవాన్ ఇక లేరు.. శనివారం అంత్యక్రియలు!
🚨 ఏపీలో అత్యంత దారుణ ఘటన
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులను ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను మభ్యపెడుతున్న హాస్టల్ వంట మనిషి
ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
విద్యార్థినులతో… pic.twitter.com/cujnVmLZ65
— Telugu Feed (@Telugufeedsite) September 30, 2026
దీంతో భయపడిపోయిన విద్యార్థినులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా గుర్తించినట్లు సమాచారం.
విద్యార్థినులను హాస్టల్ నుంచి ఎందుకు తీసుకెళ్లారు? వారిని ఆ వ్యక్తి ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాలో స్పెషల్ క్లాసులు పేరుతో జరిగే సన్నివేశం.. ఇప్పుడు ఏపీలో జరిగిన ఈ ఘటనను గుర్తు చేస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!









