
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో55కి పైగా అజెండా అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ పంచాయితీరాజ్ చట్టం-1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34శాతం, అర్బన్‌లో 33.1 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకుగాను పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామీణ స్థానిక సంస్థలు (RLBs) ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
Also Read : కోనసీమ జిల్లాలో మత్స్యకారుల మిస్సింగ్.. వేటకు వెళ్లి తిరిగిరాని ఏడుగురు
అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని సమావేశం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్ కు వెల్లడించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే నగర, పట్టణ, నగర పంచాయితీల్లోని మేయర్, చైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఉన్న 13 జెడ్పీలను 28 జిల్లాపరిషత్ లు గా ఏర్పాటు చేయాలని కేబినెట్నిర్ణయం తీసుకుంది. జిల్లాల విభజనకు అనుగుణంగా జెడ్పీల ను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయిచింది.
వీటితో పాటు కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Also Read : పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్ లో ఐదుగురు









