Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అగర్ మాల్వా జిల్లాలో వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో భువనేశ్వర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో కారును నడుపుతున్న స్థానిక ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : మార్చి 17న వైష్ణవి హత్య… సెప్టెంబర్‌ 17న హరిబాబు హత్య.. ఇద్దరి మధ్య 17 సెంటిమెంట్‌ ఏంటి?

నల్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ఖేడా పట్టణంలో బాగులాముఖి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 24 గంటల్లో ఆ ప్రాంతంలో దాదాపు నాలుగు అంగుళాల వర్షం కురిసింది. దీంతో వాగులు, కాలువల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో వరద నీటిలో కారు కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే నల్ఖేడా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న కారును గుర్తించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ విషాద ఘటన విషయం భువనేశ్వర్‌కు చేరడంతో జయదేవ్ విహార్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా భువనేశ్వర్‌లోని జయదేవ్ విహార్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

ఆ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లింది. యాత్రలో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మరో ఆలయానికి వెళ్తుండగా వారి కారు వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయినట్లు సమాచారం. ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం కారణంగా ఈ ప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Also Read : మీనాక్షి నటరాజన్ కు బిగ్‌షాక్‌.. విదేశీ పర్యటనపై కోర్టులో పిటిషన్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.