KMM ACCIDENT :హైదరాబాద్ – ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు కారు మొత్తం విస్తరించడంతో అందులో ఉన్న వ్యక్తి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో అందులోని వ్యక్తి సజీవ దహనమవ్వడం తీవ్రంగా కలిచివేసింది. కాగా మృతుడు ఖమ్మం జిల్లాలోని మమత హాస్పిటల్‌లో పనిచేస్తున్న న్యూరో సర్జన్‌ కాసకుర్తి జగదీశ్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం మమత ఆసుపత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న జగదీశ్‌ ఈ రోజు ఉదయం వోల్వోకారులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్దకు వచ్చేసరికి కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెంటనే అందులో మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే వీలు లేకుండా మంటలు అంటుకోవడంతో డాక్టర్‌ జగదీశ్‌ కారులోనే సజీవ సమాధి అయ్యాడు.స్థానికులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా లేని ఫలితం లేకుండా పోయింది.ఖమ్మం మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా పని చేస్తున్న జగదీశ్ ఖమ్మం నుంచి హైదరాబాద్‌లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో జగదీశ్‌ నిద్రమత్తులోకి వెళ్లడంవల్లే. కారు అదుపు తప్పి ఉంటుందని పోలీసుల అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడింది, కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.