
Youtuber Vaishnavi Case : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భర్త హరిబాబును వైష్ణవి సోదరుడు సంతోష్ నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ హత్యపై – హరిబాబు తల్లి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు హత్య తర్వాత భయంతో వణికిపోతున్న తల్లి తనకు న్యాయం జరగాలని వేడుకుంటోంది. వైష్ణవి హత్య తరువాత భయంతోనే బతుకుతున్నామన్న తల్లి ఆమె అన్నలు తనను కూడా చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. వారితో తనకూ ప్రాణహాని ఉందని లక్ష్మి ఆరోపించింది.
Also Read : హరిబాబు హత్యకేసులో బిగ్‌ట్విస్ట్… తానే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో విడుదల
వైష్ణవి హత్య తరువాత హరిబాబు తల్లి, సోదరులు కూడా అరెస్ట్ అయ్యారు. కాగా వారందరికీ 45 రోజుల్లోనే బెయిల్ రాగా హరిబాబుకు రెండు నెలల తర్వాత బెయిల్ వచ్చిందని లక్ష్మి తెలిపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత నా కొడుకును చంపేస్తామని ముందే బెదిరించారని ఆమె తెలిపింది. దీంతో ప్రాణభయంతో బతుకుతున్నామని తెలిపారు. తన పెద్ద కుమారులిద్దరూ వారి అత్తగారింటికి వెళ్లి పనిచేసుకుంటూ బతుకుతున్నారని, మేము కూడా కోరుట్ల వదిలిపెట్టి వచ్చి నిజాబాబాద్ జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. హత్య జరిగిన సమయంలో తను అక్కడే ఉన్నానని, కానీ, తన కొడుకును కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. హరిబాబు అన్నం తినేందుకని పక్కనే ఉన్న బండివద్దకు నీళ్లకోసం వెళ్లాడని చెప్పారు. నీళ్లు పట్టుకునేందుకు వంగిన సమయంలో కారులో వచ్చిన వైష్ణవి అన్న కారు నుంచి దిగి పరుగెత్తుకుంటూ వచ్చి కత్తితో దాడి చేశాడని కన్నీటిపర్యంతమయ్యారు. వైష్ణవి హత్య కేసులో ఇప్పటికే శిక్ష అనుభవించామని, ఇల్లు, నగలు, డబ్బులు అన్ని కోల్పోయామని ఇపుడు కొడుకును కూడా కోల్పోయామని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వైష్ణవి అన్నలు ఎప్పటికున్న తమను చంపేస్తారని తమకు రక్షణ ఇవ్వాలని ఆమె ప్రాధేయపడ్డారు. తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.
Also Read : యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసులో సంచలనం.. భర్త హరిబాబు దారుణ హత్య
కాగా రెండెళ్ల క్రితం వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు ఆరునెలల క్రితం వైష్ణవిని వరకట్నం కోసం దారుణంగా హత్య చేశాడు. నాలుగు నెలల గర్భవతి అని తెలిసినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను గొంతుపిసికి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో హరిబాబుతో పాటు తల్లి లక్ష్మి, సోదరులు అరెస్ట్ అయి శిక్ష అనుభవించారు. ఈ మధ్యనే బెయిల్ పై విడుదలయ్యారు. కాగా వైష్ణవి హత్య తర్వాత హరిబాబుపై కక్ష పెంచుకున్న అన్నదమ్ములు ఎప్పటికున్న హరిబాబును చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన విధంగానే — నిన్న నిజామాబాద్ RR చౌరస్తాలో హరిబాబుపై కత్తితో దాడి చేసిన వైష్ణవి సోదరుడు సంతోష్. — హరిబాబు మెడపై సంతోష్ కత్తితో దాడి చేశాడు. కేవలం 8 సెకన్లలో 9 సార్లు వేటు వేయడంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. — వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే హరిబాబుపై దాడి చేసినట్లు సంతోష్ అంగీకరించాడు.









