Tirupati : తిరుపతిలో కొద్దిసేపటి క్రీతం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. డీబీఆర్‌ రోడ్డులో ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం వినియోగించిన భారీ క్రేన్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగి లోతులో దిగబడిపోవడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో క్రేన్‌ కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా క్రేన్‌ను తొలగించే పనులు చేపట్టిన పోలీసులు దానికింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : శంషాబాద్ దిశ ఘటన స్థలంలో దారుణం… మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగిక దాడి యత్నం

Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.