
Aadarsa Kutumbam : విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరను రూ.75 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. పెంచిన టికెట్ ధరలు సినిమా విడుదలైన అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ కథ, కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ అంశాలతో సినిమా రూపొందినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. దీపావళి పండుగకు ముందు అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.









