Rahul Sipligunj : ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ చిక్కుల్లో పడ్దారు. ఆయనపై విశాఖపట్నంలో కేసు నమోదవడం సంచలనంగా మారింది. తనను మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్నానికి చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంవీపీ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. వ్యక్తిగత వీడియోలు, కాల్ రికార్డింగ్స్‌ను అడ్డుపెట్టుకుని తనను తీవ్రంగా బెదిరింపులకు గురిచేశారు.

Also Read : బిగ్ షాక్ .. నటుడు ప్రకాశ్‌రాజ్ ఓటు గల్లంతు!

ఈ వివాదం మరింత ముదిరిన తర్వాత, సెటిల్మెంట్ పేరుతో ఆ యువతిని హైదరాబాద్‌కు పిలిపించి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు అతని బావమరిది, మధ్యవర్తిత్వం పేరుతో మోసానికి పాల్పడిన వారితో కలిపి మొత్తం 16 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు ప్రమేయం ఉన్న అందరినీ త్వరలోనే విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రాకుండా పోలీసులు ప్రస్తుతం గోప్యత పాటిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : హుషారు పిట్టలు ట్రైలర్‌ వచ్చేసింది !

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.