
గాందీవధారి అర్జున అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వరుస ప్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి ఓ మంచి హిట్ కొట్టాలనే కసితో ‘కొరియన్ కనకరాజు’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి కనకరాజు పాత్ర వరుణ్ కు కలిసొచ్చిందా? తన ఖాతాలో హిట్ పడిందా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : నరకం చూశా.. అప్పుల కోసం సీ గ్రేడ్ సినిమాలు చేశా : సుస్మితా ముఖర్జీ
‘కొరియన్ కనకరాజు’ ఎలా ఉంది?
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్- కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మొదటి అరగంట పాటు కథ ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ, ఇంటర్వెల్ చేరుకునే సరికి కథ గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వరుణ్- సత్య కామెడీ సన్నివేశాలు, స్టైలిష్ యాక్షన్ మిక్స్తో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం ఎపిసోడ్స్, డాగ్ బ్లాక్, బార్ సీక్వెన్స్ బిగ్గెస్ట్ హైలైట్స్. లవ్ ట్రాక్ ఫ్రెష్ గా అనిపిస్తాయి.
ఇక ఇంటర్వెల్ వచ్చేసరికి మెల్లిగా కథనంలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సెకండ్ ఆఫ్ లో మూవీ హారర్-కామెడీ నుంచి యాక్షన్ జోన్ కి షిఫ్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ కంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలతో సరిపెట్టినట్లు అనిపిస్తుంది. అవి కూడా ప్రాపర్ టైమింగ్ లో లేనట్లు ఉంటాయి. దీంతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అవుతారు. దీనికి తోడు బలహీనమైన క్లైమాక్స్ కథ ప్రభావాన్ని మరింత తగ్గించింది. ఏదో ఏఐ తో క్రియేట్ చేసినట్లుగా ఉందనే ఫీలింగ్ కలిగిస్తుంది.
బీజీఎం, పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సాహిత్యం బాగున్నప్పటికీ, కంపొజిషన్ రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. తమన్ బీజీఎం విషయంలో న్యాయం చేయలేదనిపిస్తుంది.
వరుణ్ పర్ఫార్మెన్స్: వరుణ్ లుక్స్, అనంతపురం యాస, సటిల్ ఎక్స్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ , ఆ స్టైల్, స్వాగ్ కూడా బాగున్నాయి.
రితిక: ఇక యంగ్ బ్యూటీ రితిక తన పాఠకు పెద్దగా స్కోప్ లేకపోయినా, ఉన్నంతలో బాగా చేసింది. తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది.
సత్య: వరుణ్ తేజ్ తో పాటు ఈ సినిమాకు సత్య మరో హైలైట్ అని చెప్పొచ్చు. సత్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అనంతపురం యాసలో వరుణ్- సత్య సన్నివేశాలు ఫుల్ ఎంటర్ టైం చేశాయి.
Also Read : క్యామియో రోల్స్ ఇక చేయను.. విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం
హిట్టు కొట్టాడా?
మొత్తానికి కామెడీ జానర్స్ ఇష్టపడే వారు, కామిడీ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ‘కొరియన్ కనకరాజు’ మూవీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి వరుణ్ హిట్టు కొట్టాడా? అంటే గత సినిమాలతో పోలిస్తే ఇదిక మంచి సినిమానే అంటున్నారు ఆడియన్స్.









