
NTR : ఏఐతో దేవర సినిమాలో చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేసి అసభ్యంగా వీడియో చేయడంపై హీరో ఎన్టీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను అవమానించేలా ఇలాంటి వీడియోలు చేయడం చాలా తప్పని ఆయన అన్నారు. ఈ వీడియో వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోనని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో దీనిపై స్పందించిన ఎన్టీఆర్.. మహిళలను గౌరవించే మన దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఒక మహిళను చెడ్డగా చూపించేందుకు ఏఐని ఇలా వాడటం చాలా నీచమైన పని అని మండిపడ్డారు. చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేసిన వారి వివరాలు బయటకు తీసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : సెల్ఫీ కోసం వచ్చాడు.. బుగ్గ గిల్లి వెళ్లాడు… హీరోయిన్ కు ఊహించని షాక్!
అంతేకాదు.. ఇలాంటి అసభ్య వీడియోలను ఎవరూ చూడొద్దని, వాటిని షేర్ చేయొద్దని ఎన్టీఆర్ కోరారు. ఈరోజు ఇంకొక మహిళకు ఇలా జరిగింది.. రేపు మన ఇంట్లో ఉన్న తల్లి, భార్య, కూతురికి కూడా ఇలాంటి సమస్య రావచ్చని అన్నారు. ఏఐని తప్పుగా వాడేవారిపై కఠినంగా చర్యలు తీసుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొత్త నిబంధనలు తీసుకురావాలని కోరారు.
కాగా ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవరకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సినిమాలోని చుట్టమల్లే, దావూదీ, ఆయుధ పూజ పాటలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా చుట్టమల్లే పాటకు అనిరుధ్ సంగీతం, శిల్పారావు గానం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
Also Read : హీరో భార్యకు నేను నచ్చలేదట.. అందుకే సినిమా నుంచి తీసేశారు: తాప్సీ









