
Rashmika Mandanna : టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు తీవ్ర గాయమైంది. ఒక డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, కఠినమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చేయాల్సి రావడంతో ఆమె శరీరానికి తీవ్ర ఒత్తిడి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్మెంట్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రష్మిక రాబోయే 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె కోలుకుని తిరిగి షూటింగ్స్‌లోకి రావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
Also Read : ఏకంగా సాయిపల్లవినే డ్యామినెట్ చేసింది… ఎవరి బ్యూటీ?
Also Read : ‘శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. సూపర్ స్టార్ మనవడు హిట్ కొట్టాడా?









