Allu Arjun : ఫ్యాన్స్ మీటింగ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో ముఖాముఖి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జీవితంలో సమయం ఎంతో విలువైందని, దానిని అనవసరమైన విషయాల కోసం వృధా చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.

Also Read : జయం రవికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం!

ఎవరినైనా ఇష్టపడకపోతే లేదా ఎవరైనా నచ్చకపోతే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కేవలం నచ్చలేదన్న ఒకే ఒక్క కారణంతో ఎవరినీ ట్రోల్ చేయడం, వారిపై ద్వేషాన్ని పెంచుకోవడం లాంటివి అసలు చేయకూడదని సూచించారు. అలా ఇతరులను ట్రోల్ చేస్తూ మీ అమూల్యమైన కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.

ఎవరి కోసమో మీ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేయవద్దని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. మీ దగ్గర ఉన్న శక్తిని, సమయాన్ని పూర్తిగా మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబ సభ్యుల బాధ్యతల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరారు. జీవితంలో నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా సమయం లేదా డబ్బు కేటాయించవద్దని, ఏదైనా నచ్చకపోతే తక్షణమే దానిని వదిలేసి ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయాకి వస్తే సౌత్ ఇండియా క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన హీరోగా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి తరచూ షూటింగ్, లుక్ టెస్ట్‌లకు సంబంధించిన వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read : ‘గబ్బర్ సింగ్’ నటుడి కుటుంబానికి చిరంజీవి భారీ ఆర్థిక సాయం..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.