First Muslim Senator : అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సరికొత్త రికార్డులు సృష్టించి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. మిచిగాన్ నుంచి పోటీ చేసిన అబ్దుల్ ఎల్-సయీద్ అమెరికా సెనేట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించగా, భారత సంతతికి చెందిన పియా దండియా ఫ్లోరిడా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

Also Read : హర్మూజ్‌లో భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్.. ఇరాన్ కీలక నిర్ణయం!

మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయీద్

ఈజిప్టు మూలాలున్న 42 ఏళ్ల పబ్లిక్ హెల్త్ యాక్టివిస్ట్ అబ్దుల్ ఎల్-సయీద్ మిచిగాన్ నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం అభ్యర్థిగా హిస్టరీ క్రియేట్ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రిపబ్లికన్ క్యాండిడేట్ మైక్ రోజర్స్‌పై 51.97% ఓట్లతో (సుమారు 22.07 లక్షల ఓట్లు) ఎల్-సయీద్ విజయం సాధించారు.

ఆయన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, కొలంబియా యూనివర్సిటీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రోడ్స్ స్కాలర్‌గా డాక్టరేట్ సాధించారు. గతంలో వేన్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు లీడర్‌గా సేవలందించిన ఆయన, ప్రచారంలో ప్రధానంగా ప్రజల లివింగ్ కాస్ట్, ‘మెడికేర్ ఫర్ ఆల్’, ఎలక్షన్ ఫండ్స్ సంస్కరణలు, ఇజ్రాయెల్‌కు మిలిటరీ ఎయిడ్ నిలిపివేత వంటి కీలక అంశాలను బలంగా వినిపించారు. 2018 గవర్నర్ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పాడ్‌కాస్ట్‌లు, టీవీ షోలు, పుస్తకాల ద్వారా ప్రజల్లో ఉంటూ, ఏడేళ్ల తర్వాత గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు.

Also Read : అమెరికా బాంబులకి ఇరాన్ వణుకు.. పౌరులకు ఇరాన్ 24 గంటల డెత్‌-వార్నింగ్ జారీ!

ఫ్లోరిడాలో భారత సంతతి పియా దండియా సత్తా

మరోవైపు, ఫ్లోరిడా 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన భారత సంతతి ఫస్ట్-జనరేషన్ అమెరికన్ పియా దండియా ఘనవిజయం సాధించారు. రిపబ్లికన్ ప్రత్యర్థి కేసీ ఆస్కర్‌పై 51.9% ఓట్లతో గెలుపొందారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో పెరిగిన పియా, తన కెరీర్‌ను టీచర్‌గా ప్రారంభించి ఆ తర్వాత న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో హైస్కూల్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పేద విద్యార్థులకు మెరుగైన ఎడ్యుకేషన్, కెరీర్ ఆపర్చునిటీస్ కల్పించడమే లక్ష్యంగా స్వయంగా ఒక హైస్కూల్‌ను కూడా స్థాపించారు.