భారత సాయుధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. అగ్నివీరుల సర్వీస్ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఇప్పటివరకు 4 ఏళ్లుగా ఉన్న సర్వీస్ వ్యవధి ఇప్పుడు మొత్తం 6 ఏళ్లకు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read : సర్కార్ సంచలన నిర్ణయం: రెండో పెళ్లి చేసుకుంటే జాబ్ ఖతమ్

18 వేల మందికి భారీ రిలీఫ్

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల నుంచి సుమారు 18,000 మంది అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీస్ ముగించుకుని బయటకు రావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది యువతకు ఊరట కలిగించింది. సాయుధ దళాల్లో తమ సేవలను కొనసాగించేందుకు అగ్నివీరులందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి అధికారికంగా ప్రకటించారు.

Also Read : దీపావళి స్వీట్లలో డేంజర్.. ఫేక్ స్వీట్లను కనిపెట్టడం ఎలాగంటే?

పనితీరు ఆధారంగా పర్మనెంట్ జాబ్స్

ఈ అదనపు రెండేళ్ల సర్వీస్ సమయంలో అగ్నివీరుల పనితీరును నిశితంగా పరిశీలిస్తారు. వారి ప్రతిభ, పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు కేటాయించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ప్రతిభ, సైనిక అవసరాల ఆధారంగా కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ సర్వీస్‌లోకి తీసుకునే వెసులుబాటు ఉంది. మిగతా 75 శాతం మందికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పాటు స్కిల్ సర్టిఫికెట్స్ అందించి రిలీవ్ చేస్తున్నారు. దీనివల్ల వారు బయట సివిల్ జాబ్స్ లేదా ప్రైవేట్ సెక్టార్‌లో సులభంగా సెటిల్ అయ్యే అవకాశం లభిస్తుంది. అయితే తాజా నిర్ణయంతో సర్వీస్ కాలం ఆరేళ్లకు పెరగడం వల్ల అగ్నివీరులకు కెరీర్ పరంగా మరింత స్థిరత్వం, సాయుధ దళాల్లో శాశ్వత ఉద్యోగం సాధించేందుకు మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.