Snake Vs Man:  సాధారణంగా మనుషులకు పాములంటేనే ఒళ్లు గగుర్పొడిచే భయం ఉంటుంది. కళ్ల ముందు పాము ఆకారం కనిపిస్తే చాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అయితే, ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి ఏమాత్రం జంకు లేకుండా నేరుగా ఒక పెద్ద సర్పంతోనే తలపడ్డాడు. పాముకు చుక్కలు చూపిస్తూ అతను చేసిన భీకర ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ, నెటిజన్లను మాత్రం ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఘర్షణల మధ్య ఆ సర్పం సమయం చూసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా, ఆ వ్యక్తి మాత్రం దాన్ని అస్సలు వదల్లేదు. పాము తోకను చేతులతో పట్టుకుని మరీ వెనక్కి లాగుతూ వేధించాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తమైన ఆ సర్పం అతన్ని గట్టిగా కాటేసినట్లు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పాముపై మళ్లీ దాడిని కొనసాగించాడు. చివరగా అతను కాళ్లతో గట్టిగా తన్నడంతో, ఆ పాము గాల్లో పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న బురదలో పడిపోయింది. అంతటితో ఆ వీడియో ముగిసింది.
ఈ భయంకరమైన ఫైట్ తర్వాత, సర్పం కాటుకు గురైన ఆ వ్యక్తికి ఏమైంది? అతనికి ప్రాణాపాయం తప్పిందా లేదా? అనే వివరాలపై స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట 2.9 మిలియన్లకు పైగా వీక్షణలను (Views) సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తోంది. కొందరు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఆశ్చర్యపోతుంటే, మరికొందరు మాత్రం తనను తాను రక్షించుకోవడానికి ఆ పాము చూపిన ధైర్యాన్ని, పట్టుదలను మెచ్చుకుంటున్నారు.