
Road Accident : తూర్పు బల్గేరియాలో మంగళవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని సోఫియాను, బ్లాక్ సీ పోర్ట్ నగరమైన బుర్గాస్తో అనుసంధానించే మోటర్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 86 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : అసలేం జరుగుతోంది: అమెరికా రక్షణ మంత్రిపై వేటు.. ఎవరీ పీట్ హెగ్సెత్?
Drone footage reveals the horrifying scale of the tragedy on Bulgaria’s Trakia Motorway. Over 50 vehicles, including cars and trucks, were involved in the massive pile-up, leaving at least 12 people dead and dozens injured. One of Bulgaria’s deadliest road disasters. 😭 https://t.co/NfyVJyGotH
— една българка (@transbulgaria) November 10, 2026
మంగళవారం ఉదయం 7 గంటలకు యాంబోల్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా పొగమంచు తీవ్రస్థాయిలో కమ్ముకుంది. దీంతో విజిబిలిటీ ఒక్కసారిగా పడిపోవడంతో, ఒకే ప్రదేశంలో అటు, ఇటు ఉన్న రెండు క్యారేజ్వేలలోని వాహనాలు అదుపుతప్పి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన వాటిలో చాలా వరకు భారీ ట్రక్కులు, కార్లు ఉన్నాయి. ఘటనా స్థలంలోనే 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కాత్యా ఇవ్కోవా వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన 46 మందిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని మెడికల్ ఫెసిలిటీలకు తరలించినట్లు ఆమె తెలిపారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైవేను రెండు వైపులా పూర్తిగా మూసివేశారు.
🚨🇧🇬 BULGARIA MOTORWAY HORROR: 12 DEAD, DOZENS INJURED, MORE THAN 70 VEHICLES INVOLVED — TWO MASSIVE PILE-UPS FIVE KILOMETRES APART AS DRIVERS REPORTED VISIBILITY OF JUST ONE METRE!
New details are emerging about the devastating November 10 motorway disaster near Yambol in southeastern Bulgaria.
This was not one collision. Two separate mass pile-ups struck opposite directions of the Trakia motorway within minutes of each other.
The first emergency call came around 7:10 a.m., near kilometre 289 towards Burgas. Another major pile-up occurred near kilometre 294 towards Sofia.
According to Bulgaria’s health minister, 12 people died — 10 at the scene and two during transport to hospital. At least 46 people were taken for medical treatment.
Witnesses described fog so thick that visibility was reportedly reduced to approximately ONE METRE.
Cars were crushed between heavy trucks. Vehicles caught fire. Some motorists were trapped inside wreckage, while emergency crews struggled to reach them.
The disaster was so extensive that authorities mobilised military personnel, prepared military air transport for the injured and removed sections of motorway barriers to reach victims.
THE QUESTION NOW: HOW DID TWO MASSIVE PILE-UPS OCCUR ON THE SAME MOTORWAY WITHIN MINUTES — AND COULD MORE LIVES HAVE BEEN SAVED?
Investigators are examining the collisions and the role of extremely poor visibility, road conditions and driving speeds.
🇧🇬 12 PEOPLE HAVE LOST THEIR LIVES. BULGARIA IS MOURNING.
Our condolences to every family affected by this tragedy.
— Slavic Networks (@SlavicNetworks) November 10, 2026
Also Read : అమెరికా రాజకీయాల్లో సడన్ ట్విస్ట్.. ఓటమి తర్వాత ట్రంప్ వేసిన ఊహించని స్కెచ్!
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రీజినల్ గవర్నర్ మిహైల్ కాషెరోవ్ మాట్లాడుతూ.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని, తన జీవితంలో ఇలాంటి భయంకరమైన సీన్ ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా విస్తరించిన దట్టమైన ఫాగ్ వల్ల రోడ్డు కనిపించకపోవడం, వర్షం కారణంగా తడిసిన రోడ్డు, ప్రతికూల పరిస్థితులకు తగని మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు.
ఈ దుర్ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. బల్గేరియా పర్యటనలో ఉన్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సమావేశమైన ప్రధాని రుమెన్ రాదేవ్, తన షెడ్యూల్‌ను అర్ధాంతరంగా ముగించుకుని సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు. అటు ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారిస్ పీస్ ఫోరమ్‌లో పాల్గొంటున్న ప్రెసిడెంట్ ఇలియానా యోటోవా సైతం తన పర్యటనను రద్దు చేసుకుని తక్షణమే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.









