
Best Health Insurance Plan : ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న జబ్బు వచ్చినా చేతిలో డబ్బులు కలగడం కష్టంగా మారుతోంది. అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం చాలా అవసరం. ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ బిల్లుల భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి ఈ 2026లో మన దేశంలో అత్యుత్తమ సేవలు, ఎక్కువ హాస్పిటల్ నెట్‌వర్క్ అందిస్తున్న టాప్ 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవో తెలుసుకుందాం.
హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి ఏడూ కొంత డబ్బు కడతాం. దానికి బదులుగా మనకు ఒంట్లో బాగోలేక హాస్పిటల్‌లో చేరినప్పుడు అయ్యే ఖర్చులను ఆ కంపెనీ భరిస్తుంది. దీనివలన మనకు చాలా లాభాలుంటాయి. హాస్పిటల్‌లో చేరినప్పుడు జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండానే ఇన్సూరెన్స్ కార్డు చూపించి ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. హాస్పిటల్‌లో చేరకముందు అయ్యే ఖర్చులు, డిశ్చార్జ్ అయిన తర్వాత వాడే మందుల ఖర్చులు కూడా కంపెనీ ఇస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియంపై ఆదాయపు పన్ను (సెక్షన్ 80D) మినహాయింపు కూడా పొందవచ్చు.
2026లో బెస్ట్ కవరేజ్ ఇస్తున్న 5 పెద్ద కంపెనీలు
అకో ఇన్సూరెన్స్ : ఇది పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా పనిచేసే డిజిటల్ కంపెనీ. ఫోన్ ద్వారానే పాలసీని సులువుగా కొనుక్కోవచ్చు, క్లైమ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వీరికి 11,500 కంటే ఎక్కువ హాస్పిటల్స్‌తో లింక్ ఉంది. కొన్ని ప్లాన్స్‌లో హాస్పిటల్ గది అద్దెపై ఎలాంటి పరిమితులు ఉండవు. అకో ప్లాటినం హెల్త్ ప్లాన్, అకో స్టాండర్డ్ హెల్త్ ప్లాన్ ఇందులోని పాపులర్ ప్లాన్స్.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో : మన దేశంలో చాలా నమ్మకమైన, పెద్ద కంపెనీలలో ఇది ఒకటి. వీరికి 16,000 కంటే ఎక్కువ హాస్పిటల్స్ నెట్‌వర్క్ ఉంది. అంటే దాదాపు మీరు ఏ ఊరి హాస్పిటల్‌కు వెళ్లినా వీరికి లింక్ ఉంటుంది. క్లైమ్ చేసుకోకపోతే నో-క్లైమ్ బోనస్ కింద కవరేజ్ పెరుగుతుంది. మై హెల్త్ సురక్ష, ఆప్టిమా రిస్టోర్ ఇందులోని పాపులర్ ప్లాన్స్.
నివా బూపా: ఇందులో ఫ్యామిలీకి, వయసైన వారికి విడివిడిగా మంచి ప్లాన్స్ ఉన్నాయి. వీరికి 10,000కు పైగా హాస్పిటల్స్ నెట్‌వర్క్ ఉంది. కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌లో ఆడవాళ్లకు మెటర్నిటీ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. రీఅష్యూర్, ఆస్పైర్, హెల్త్ కంపానియన్ అనేవి ఇందులోని పాపులర్ ప్లాన్స్.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ : మన అవసరాలకు తగ్గట్టుగా పాలసీని మార్చుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశవ్యాప్తంగా వీరికి 11,400కు పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ప్లాన్లు ఇందులో లభిస్తాయి. కేర్ సుప్రీమ్, కేర్ అడ్వాంటేజ్ అనేవి ఇందులోని పాపులర్ ప్లాన్స్.
స్టార్ హెల్త్ : కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే ఉన్న మన దేశపు అతిపెద్ద కంపెనీలలో ఇది ఒకటి. వీరికి 14,000కు పైగా హాస్పిటల్స్ నెట్‌వర్క్ ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఇందులో ప్రత్యేకమైన ప్లాన్లు ఉన్నాయి. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా, స్టార్ కాంప్రహెన్సివ్ అనేవి ఇందులోని పాపులర్ ప్లాన్స్.
అయితే మీరు పాలసీ తీసుకునే ముందు ఈ 4 విషయాలు చూసుకోవాలి. ముందుగా మీరు తీసుకునే కంపెనీకి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్ద హాస్పిటల్స్‌తో లింక్ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడే ఎమర్జెన్సీలో క్యాష్‌లెస్ వైద్యం దొరుకుతుంది. కంపెనీకి వంద క్లైమ్స్ వస్తే అందులో ఎన్ని పాస్ అవుతాయో చూసుకోవాలి. ఈ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. హాస్పిటల్‌లో చేరినప్పుడు రూమ్ అద్దెకు కొంత లిమిట్ పెడుతుంటారు. ఆ లిమిట్ లేని ప్లాన్ లేదా ఎక్కువ లిమిట్ ఉన్న ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఇక చివరగా ఇదే ముఖ్యమైనది కూడా, మీకు ముందే ఏవైనా జబ్బులు ఉంటే, అవి ఎన్ని ఏళ్ల తర్వాత కవర్ అవుతాయో ముందే అడిగి తెలుసుకోవాలి.









