
ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై బలమైన ప్రత్యర్థిగా నిలిచిన మాజీ మిలిటరీ చీఫ్, ‘యషార్’ పార్టీ అధినేత గాడీ ఐసెంకోట్(Eisenkot) పీఎం రేసులో దూసుకుపోతున్నారు. పీఎం నరేంద్ర మోదీ, నెతన్యాహు మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న బలమైన పర్సనల్ కెమిస్ట్రీ కారణంగా భారత్-ఇజ్రాయెల్ బంధం కొత్త పుంతలు తొక్కింది. అయితే, నెతన్యాహు స్థానంలో ఐసెంకోట్ పగ్గాలు చేపడితే ఈ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయా? న్యూఢిల్లీ ప్రాధాన్యత తగ్గుతుందా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది.
Also Read : 5వేల కోట్ల ఆస్తి వివాదం.. కోర్టు మెట్లెక్కిన మైఖేల్ జాక్సన్ కూతురు
లీడర్లు మారినా చెక్కుచెదరని ద్వైపాక్షిక వ్యూహం
డిప్లొమాటిక్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, ఇజ్రాయెల్‌లో నాయకత్వం మారినప్పటికీ భారత్‌తో సంబంధాల్లో పెద్దగా తేడా ఉండదు. కారణాలు స్పష్టం..
ఇన్‌స్టిట్యూషనల్ భాగస్వామ్యం: ఫిబ్రవరి 2026లో భారత్, ఇజ్రాయెల్ తమ బంధాన్ని “స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్” స్థాయికి అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ రంగాల్లో ఇప్పటికే బలమైన ఒప్పందాలు కుదిరాయి.
డిఫెన్స్ & ఇంటెలిజెన్స్ టై-అప్స్: క్రాస్-బోర్డర్ టెర్రరిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం ఎదుర్కోవడంలో ఇరుదేశాలది ఉమ్మడి వైఖరి. నవంబర్ 2025లో కుదిరిన డిఫెన్స్ కోఆపరేషన్ మెమోరాండమ్ స్థిరమైన పునాదిని నిర్మించింది.
ట్రేడ్ & బిజినెస్ ప్రాజెక్టులు: హైఫా పోర్ట్ (Haifa Port)లో భారత్ పెట్టిన భారీ ఇన్వెస్ట్‌మెంట్లు, ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA), అలాగే దాదాపు 3.93 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం వ్యక్తులపై ఆధారపడినవి కావు.
Also Read : లాస్ ఏంజెల్స్ మేయర్‌గా కేరళ మహిళ.. నిత్య రామన్ సరికొత్త చరిత్ర
ఐసెంకోట్ మైండ్‌సెట్: భారత్‌కు ప్లస్సా, మైనస్సా?
నెతన్యాహు ఇటీవల అమెరికాపై డిపెండెన్సీ తగ్గించుకునే క్రమంలో భారత్‌ను ఒక “గ్లోబల్ పవర్‌హౌస్”గా అభివర్ణిస్తూ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. మరోవైపు, ఐసెంకోట్ సంప్రదాయ వెస్ట్రన్ దేశాలతో (ముఖ్యంగా అమెరికా, యూరప్) దౌత్య సంబంధాలను రీసెట్ చేయాలని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఐసెంకోట్ ఇరాన్, హమాస్ అంశాల్లో పూర్తి కఠినమైన వైఖరి కలిగిన వ్యక్తి. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్స్ విషయంలో భారత్ వంటి బలమైన వ్యూహాత్మక భాగస్వామిని దూరం చేసుకునే ఉద్దేశం ఆయనకు లేదు. పైగా, పశ్చిమ దేశాలతో ఆయన సత్సంబంధాలు నెరిపితే, ప్రతిష్టాత్మక IMEC (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్) ప్రాజెక్టు మరింత వేగవంతమయ్యే అవకాశముంది.









