జియో పాలిటిక్స్ గందరగోళంగా ఉంటాయి. బయటకు ఫ్రెండ్లీగానే ఉన్నట్లు కనిపిస్తాయి కానీ, కొన్ని దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం.. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అన్నా అంటే భారత్‌కు అండగా ఏ దేశం నిలబడుతుందో తెలుసా? గ్లోబల్ పాలిటిక్స్‌లో ఎన్ని సమీకరణాలు మారినా, ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు భారత్‌కు వెన్నుదన్నుగా నిలిచే అసలైన మిత్రదేశాలు ఏవి? ఈ ప్రశ్నకు దేశ యువత స్పష్టమైన సమాధానం ఇచ్చింది. న్యూఢిల్లీలోని ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో రష్యా, ఇజ్రాయెల్‌లు టాప్ పొజిషన్‌లో నిలిచాయి.

యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల్లోని దాదాపు 42 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తూ, 21 నుంచి 40 ఏళ్ల యువతపై ఈ సర్వే నిర్వహించారు. సంక్షోభ సమయాల్లో భారత్‌కు తోడుగా నిలిచే దేశాల్లో రష్యా నంబర్ వన్ స్థానంలో నిలవగా, 57% మద్దతుతో ఇజ్రాయెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 62% మంది యువత ఇజ్రాయెల్‌ను భారత్‌కు ‘బెస్ట్ ఫ్రెండ్’గా గుర్తించారు. ఇక ఓవరాల్ పబ్లిక్ ట్రస్ట్ విషయంలో రష్యా, జపాన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, 57% మంది విశ్వాసంతో ఇజ్రాయెల్ మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో అమెరికా, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి.

Also Read : రచ్చరంబోలా సేల్.. రూ.10వేలకే సరికొత్త స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్ మావా..!

డిఫెన్స్, అగ్రికల్చర్ రంగాలే ప్రధాన బలం

ఇజ్రాయెల్‌పై ఇంతటి పాజిటివ్ ఇంప్రెషన్ రావడానికి డిఫెన్స్, అగ్రికల్చర్ రంగాల్లోని బలమైన పార్ట్‌నర్‌షిప్పే ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న 61% మంది మోడ్రన్ టెక్నాలజీ, రక్షణ రంగాలలో ఇజ్రాయెల్ సహకారం ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో దేశవ్యాప్తంగా 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటయ్యాయి. యూపీలోని బస్తీ, కనౌజ్, బీహార్‌లోని వైశాలి, నలంద కేంద్రాల్లో రైతులకు డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక సాగు పద్ధతుల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా యూపీలోని గోరఖ్‌పూర్ (91%), వారణాసి (88%) నగరాల్లో అత్యధిక శాతం మంది ఇజ్రాయెల్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

అగ్రికల్చర్ ప్రాజెక్టులతో పాటు ఇజ్రాయెల్‌లో భారతీయులకు దక్కుతున్న ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు, పెరుగుతున్న బైలేటరల్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా పడుతున్న అడుగులు ఈ నమ్మకాన్ని మరింత పెంచాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది భవిష్యత్తులో ఈ బంధం మరింత స్ట్రాంగ్ కావాలని ఆకాంక్షించారు. గ్లోబల్ వేదికపై ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ, భారతీయుల దృష్టిలో రష్యా, ఇజ్రాయెల్‌లే నిజమైన ఆపద్బాంధవులని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

Also Read : E20 కాస్తా 420 అయ్యింది.. ఇథనాల్ బ్లెండింగ్‌పై రాహుల్ సెటైర్లు