ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ప్రజా సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు, నిరుద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read : తెలుగు రాష్ట్రాలకు భారీగా కేంద్ర నిధులు.. లక్ష కోట్లు విడుదల

రూ.5 లక్షల ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్: నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగే భారీ పబ్లిక్ మీటింగ్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తారు. ఇందిరమ్మ కమిటీలు నవంబర్ 20 నుంచి 30 వరకు డోర్-టు-డోర్ వెళ్లి అప్లికేషన్లు సేకరిస్తాయి. అదే రోజు మహిళలకు చీరల పంపిణీ కూడా ప్రారంభమవుతుంది.
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సెలబ్రేషన్స్: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేడుకల్లో పాల్గొంటారు.
ఎస్సీ, ఎస్టీలకు సపరేట్ కమిషన్లు: ఉమ్మడి కమిషన్‌ను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులుంటారు.
కోర్టుల్లో 136 కొత్త పోస్టుల భర్తీ: కాటారం, ఎల్కతుర్తి కోర్టులకు 56 పోస్టులు, మరో నాలుగు అదనపు కోర్టులకు 80 పోస్టులు కలిపి మొత్తం 136 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా శాఖల్లోని ఖాళీలను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు.

Also Read : భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్.. హైదరాబాద్‌కు డేంజర్?

  • యాక్ట్ అమెండ్‌మెంట్స్ & రిఫార్మ్స్:

    ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినతరం చేస్తూ తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టంలో ఆర్డినెన్స్ ద్వారా సవరణలు. భూ సరిహద్దు వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు సర్వే అప్పీళ్ల గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గింపు.

ఇక నవంబర్ 7 నుంచి 9 వరకు సీఎం కొడంగల్‌లో పర్యటించి రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోల్లో పాల్గొంటారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.