అందాల భామల ప్రపంచంలో భారత్ సత్తా చాటేందుకు మరో అరుదైన వేళ ఆసన్నమైంది. ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో మన దేశానికి తరుపున ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కజియా లిజ్ మేజో బయలుదేరారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేషనల్ ఫ్లాగ్‌తో ఆమె బయలుదేరిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. సర్వేలో సంచలన నిజం

రాయల్ లుక్‌లో మెరిసిన మెరూన్ చీర

ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం కజియా సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ సమంత్ చౌహాన్ డిజైన్ చేసిన ఆర్గాంజా, రా సిల్క్ బ్లెండ్ మెరూన్ శారీలో ఆమె అప్సరసలా కనిపించారు. జరీ వర్క్, గ్రాండ్ ఎంబ్రాయిడరీ పల్లుతో డిజైన్ చేసిన ఈ రాయల్ శారీ ఖరీదు సుమారు రూ.1.42 లక్షలు. ఈ చీరకు మ్యాచింగ్ స్టడెడ్ నెక్లెస్‌, ఇయర్‌రింగ్స్, చేతికి బ్యాంగిల్స్‌తో పాటు తలపై మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని ధరించి అదిరిపోయే స్టైల్‌లో దర్శనమిచ్చారు.

Also Read : దీపావళి బంపరాఫర్లు: టీవీ, వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.40కే పొందొచ్చు.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

ఎవరీ కజియా లిజ్ మేజో?

కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా 2007లో జన్మించారు. ఆమె చిన్నతనం అంతా అబుదాబిలోనే గడిచింది. ప్రస్తుతం లా డిగ్రీ చదువుతున్న ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ, మోడలింగ్‌లోనూ దూసుకుపోతున్నారు. 12 ఏళ్లపాటు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడమే కాకుండా సింగింగ్, వయోలిన్, డ్రమ్స్ వాయించడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. 17 ఏళ్ల వయసులోనే ‘మిస్ టీన్ దివా 2024’ టైటిల్ గెలుచుకున్న కజియా, ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025’లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఇటీవల మిస్ యూనివర్స్ కేరళ టైటిల్ గెలుచుకుని, అతి పిన్న వయస్కురాలైన స్టేట్ టైటిల్ హోల్డర్‌గా రికార్డు సృష్టించారు.

మరోవైపు మన పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి మిస్బా అర్షద్ కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టో రికో బయలుదేరారు. నవంబర్ 24న శాన్ జువాన్‌లోని జోస్ మిగ్యుల్ అగ్రెలోట్ కొలీజియంలో జరిగే గ్రాండ్ ఫినాలేలో 75వ మిస్ యూనివర్స్ కిరీటం ఎవరిని వరిస్తుందో చూడాలి.