
ఆర్నబ్ తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లో ధ్వంసమైన విద్యుత్ నెట్‌వర్క్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏపీలో దెబ్బతిన్న పవర్ సప్లైని రీస్టోర్ చేయడానికి అవసరమైన టెక్నికల్ సిబ్బందితో పాటు మెటీరియల్‌ను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
Also Read : ఏపీలో మూడు.. తెలంగాణలో ఆరు.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!
Konaseema’s beauty lives in its coconut palms, banana farms and decades-old giant trees. Cyclone Arnab took so much of that away in one night. I loved this place so much I moved here to build studio. It won’t be seen as it was before.💔#CycloneArnab #Konaseema https://t.co/ORkzM6Bh6X
— Soma Sankar (@somasankarkasa) October 28, 2026
ఈ క్రమంలో బుధవారం భట్టి విక్రమార్క స్వయంగా ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తుపాను తీవ్రత, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి, జరిగిన డ్యామేజ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, విద్యుత్ సరఫరాను త్వరగా నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఎంతటి సహకారానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో పరిస్థితులను వివరిస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గ్రౌండ్ లెవల్లో సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లినప్పటికీ, అధికార యంత్రాంగం మరియు ఫీల్డ్ స్టాఫ్ 24 గంటలూ శ్రమిస్తూ పవర్ సప్లైను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.
Also Read : స్టేట్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ వార్నింగ్!
Cyclone alert in Andhrapradesh 🚨
Praying for everyone safety .
Cyclone Arnab is approching the Andhra pradesh coast, bringing the
threat of extremely heavy rainfall and powerful winds up to 140km/h
1/2……. https://t.co/eB9ZuakGz3— Ashwini (@GhortaleAshwini) October 27, 2026
ఆపద సమయంలో వెంటనే స్పందించి, రీస్టోరేషన్ పనుల కోసం సిబ్బందిని, పరికరాలను పంపేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి గొట్టిపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి పరస్పర సహకారం విపత్తుల సమయంలో ప్రజల కష్టాలను త్వరగా తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.









