
దీపావళి పండుగ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో టపాసులు ఊరుఊరంతా పేలనున్నాయి. ఈ సమయంలో మీ స్నేహితులకు, మీకు నచ్చిన వారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అతి తక్కువ ధరలోనే అదిరిపోయే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. కేవలం రూ.1000 కంటే తక్కువ ధరకే గాడ్జెట్లు సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : డ్రాగన్‌కు దిమ్మతిరిగే షాక్: ఫిలిప్పీన్స్ తీరానికి భారత ‘బ్రహ్మోస్’!
బోట్ ఎయిర్‌డోప్స్ 141
దీపావళి సందర్భంగా మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వైర్లెస్ ఇయర్‌బడ్స్ boAt Airdopes 141 బెస్ట్ ఆప్షన్. ఇవి ఆన్లైన్లో కేవలం రూ.899 లకే అందుబాటులో ఉన్నాయి.
మివి రోమ్ 2
ఇది ఒక బ్లూటూత్ స్పీకర్. దీనిని ఇంట్లో, ప్రయాణంలో లేదా స్నేహితులతో సరదాగా గడిపేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది 5W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.799 కి లభిస్తుంది.
బోట్ స్టోన్ 190
boAt Stone 190 బ్లూటూత్ స్పీకర్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. దీనిని ఆన్లైన్లో రూ.799లకే సొంతం చేసుకోవచ్చు.
విప్రో 9W స్మార్ట్ LED
విప్రో 9W స్మార్ట్ LED బల్బు అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీనిని కేవలం రూ.499లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడీ బల్బును మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కొన్ని మోడళ్లలో కలర్స్, బ్రైట్నెస్ సర్దుబాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మరికొన్ని మోడళ్లు అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా పనిచేస్తాయి.
Also Read : లాస్ ఏంజెల్స్ మేయర్‌గా కేరళ మహిళ.. నిత్య రామన్ సరికొత్త చరిత్ర
హవెల్స్ HD3151 హెయిర్ డ్రైయర్
హవెల్స్ HD3151 హెయిర్ డ్రైయర్ ఆన్లైన్లో సుమారు రూ.799లకే లభిస్తుంది. ఇది 1200W పవర్, మూడు హీట్ సెట్టింగ్‌లు, మడతపెట్టగల డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మోడల్‌పై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.









