
YouTube : కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న యూట్యూబర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ (YouTube) కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం మానిటైజేషన్‌కు అవసరమైన వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసింది. కంటెంట్ క్రియేటర్లు వీడియోల ద్వారా డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్(YPP) దోహదపడుతుంది. అయితే YPPలో చేపట్టిన మార్పుల్లో భాగంగా ఈ కొత్త నిబంధన తీసుకువచ్చినట్లు యూట్యూబ్ బ్లాగ్‌పోస్ట్ తెలిపింది. గతంలో.. డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేటర్ల కు365 రోజుల్లో 4,000 వాచ్ అవర్స్ (Watch Hours) లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉంటే సరిపోయేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వీక్షణలు ఉండాలన్న నిబందనను ప్రవేశపెట్టింది.
అదే సమయంలో1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండాలనే నియమంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని యూట్యూబ్ తెలిపింది. అయినప్పటికీ ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో ఉన్న క్రియేటర్లపై ఈ ప్రభావం మాత్రం ఉండబోదని పేర్కొంది. ప్రోగ్రామ్‌లో ఇప్పటికే 3 మిలియన్లకు పైగా కంటెంట్ క్రియేటర్లు ఉన్నారని తెలిపింది. కాగా ఈ నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
Also Read : అమిత్‌షాపై ఆర్ఎస్ఎస్ గుస్సా?
యూట్యూబ్ షార్ట్స్‌లోనూ కొత్త నిబంధన..
దీంతో పాటు యూట్యూబ్ షార్ట్స్ (YouTube Shorts) ద్వారా వచ్చే ఆదాయం కోసం కూడా ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ మరో కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. షార్ట్స్‌పై వచ్చే ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడానికి అర్హత సాధించాలంటే క్రియేటర్లు 90రోజుల వ్యవధిలో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ కలిగి ఉండాలని తేల్చి చెప్పింది ఈ నిబంధన కొత్త క్రియేటర్లతో పాటు ఇప్పటికే ఉన్నవారికి కూడా వర్తించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1నుంచి ఇది కూడా అమల్లోకి వస్తుంది.
Also Read : జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో బిగ్‌ట్విస్ట్.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు
యూట్యూబ్ ప్రీమియం లైట్ విస్తరణ
మరోవైపు యూట్యూబ్ ప్రీమియం అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు ఈ ప్లాట్‌ఫామ్ ప్రీమియం లైట్ (Premium Lite) సేవలను విస్తరించనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందులోని కంటెంట్‌ను నిరంతరాయంగా చూడడానికి వీలుంటుంది. ప్రీమియం లైట్ సేవలు మనదేశంలోనూ అందుబాటులో ఉన్నాయి. దీని ధర నెలకు రూ.89 గా ఉంది. ఇక స్టాండర్డ్ ప్లాన్ ధర రూ. 149గా తెలిపింది. దీనివల్ల క్రియేటర్లు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని యూ ట్యూబ్ వెల్లడించింది.









