
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే తగ్గింపుతో అందుబాటులో ఉంది. మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాల స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశం. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, పెద్ద 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు దీని ఆఫర్, ఫీచర్‌ల గురించి తెలుసుకుందాం.
Motorola Edge 70 Offers & Price
Motorola Edge 70 మొబైల్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో రూ.29,999కి విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఇది FLIPKART లో రూ.27,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై రూ.1400 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.26,599కి లభిస్తుంది. మరోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత లేదా ప్రస్తుతం ఉన్న ఫోన్‌ను ఇస్తే రూ.21,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం పొందాలంటే.. మొబైల్ ప్రస్తుత కండీషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Motorola Edge 70 Features
Motorola Edge 70లో 6.7-అంగుళాల ఎక్స్‌ట్రీమ్ AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సూపర్ HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ Motorola Edge 70 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి మూడు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తోంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 68W టర్బోపవర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Motorola Edge 70లో OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.









