
Bengal By Elections : పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పేరు, ఫుట్బాల్ ప్లేయర్ అనే ఎన్నికల గుర్తును కేటాయించింది. మరోవైపు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ అనే పేరు, ఎన్వలప్ అనే ఎన్నికల గుర్తును కేటాయించింది. అంతకుముందు ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరును, ఆ పార్టీకి చెందిన పూలు-గడ్డి గుర్తును తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 6న జరగనున్న పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో ఈ పేరు, గుర్తును ఇరు వర్గాలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
Also Read : దేశ రాజధానిలో దారుణం.. మైనర్పై గ్యాంగ్రేప్.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
టీఎంసీ పేరు, గుర్తుపై వివాదం నేపథ్యంలో గురువారం రాత్రి ఎన్నికల సంఘం ఇరు వర్గాలకు ఈ ఆదేశాలు ఇచ్చింది. తమకు కావాల్సిన కొత్త పేర్లు, అందుబాటులో ఉన్న ఎన్నికల గుర్తుల నుంచి తమకు నచ్చిన గుర్తులను శుక్రవారం ఉదయం సమర్పించాలని సూచించింది. కొత్త పేర్లు అసలు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరును పోలి ఉండొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే కొత్త గుర్తులను మాత్రం స్వతంత్రులు, గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల కోసం అందుబాటులో ఉంచిన గుర్తుల జాబితా నుంచే ఎంచుకోవాలని సూచించింది.
పశ్చిమ బెంగాల్లోని రెజినగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే టీఎంసీలో రెండు వర్గాల మధ్య పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై వివాదం తలెత్తడంతో ఎన్నికల సంఘం ఈ మధ్యంతర నిర్ణయం తీసుకుంది.ఈ వివాదానికి నేపథ్యం 2026 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీలో మొదలైన తిరుగుబాటుకు సంబంధించినది. ఆ తర్వాత పార్టీ నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి.
జూన్లో 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా వర్గం ప్రతిపాదించిన సోవందేబ్ చటోపాధ్యాయ్కు బదులుగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయనకు గుర్తింపు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి.దీంతో 28 ఏళ్ల టీఎంసీ చరిత్రలో తొలిసారిగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఈ వివాదం పార్లమెంట్ వరకు వెళ్లింది. సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్సీపీఐలో చేరి, ప్రత్యేక బ్లాక్గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు.
Also Read : లవర్ను కలవడానికి వెళ్లి దెబ్బలు తిన్నాడు.. లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!









