Ranchi :  జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరగా అక్కడ పోలీసులు వీరిని అడ్డుకుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లను తోసుకుంటూ విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు.ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించింది. . ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. తమ ప్రాణాలు పోయినా సీబీఐ విచారణ ప్రకటిస్తేనే వెనక్కి తగ్గుతామని సీఎం హేమంత్ సోరెన్‌కు తేల్చిచెప్పారు.

Also Read : జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో బిగ్‌ట్విస్ట్‌.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు

ఈలోగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలక ప్రకటక చేసింది. జేపీఎస్సీ మాజీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్టేను అరెస్టు చేశారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కీలక ఆధారాలు లభించిన తర్వాత సీఐడీ ఈ నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల అవకతవకలలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీఐడీ ఆయనను పలుమార్లు ప్రశ్నించింది. అటు ఈడీ ఒక కేసు నమోదు చేసింది. జేపీఎస్సీ వ్యవహారాన్ని ఈడీ సుమోటోగా స్వీకరించి, మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సాధారణంగా ఈడీ షెడ్యూల్డ్ అఫెన్స్ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసులు నమోదు చేస్తుండగా, ఈడీ మాత్రం సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసింది.

కాగా ఆదివారం జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం 14వ జేపీఎస్సీ పరీక్షను, 2023, 2025 బ్యాక్‌లాగ్ నియామక పరీక్షలను రద్దు చేయడం సహా విద్యార్థులు లేవనెత్తిన పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, సీబీఐ విచారణ జరపాలన్న తమ ప్రాథమిక డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదని పేర్కొంటూ విద్యార్థులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. నిరసనకారులు రద్దు చేయాలని డిమాండ్ చేసిన 13 పరీక్షలలో ప్రభుత్వం కేవలం మూడింటిని మాత్రమే రద్దు చేసిందని చెబుతున్నారు.

Also Read : ఈ రాశులకు పట్టనున్న అదృష్టం.. ఈ ఒక్క దేవుడిని పఠిస్తే చాలు.. సమస్యలన్నీ క్లియర్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.