

GENERATION GUTTER : బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ Gen Zని “Generation Gutter” అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. అయితే ఆ వివాదం ఇంకా చల్లారకముందే కంగనా మరోసారి అదే విషయంపై మాట్లాడారు. కానీ ఈసారి ఆమె టార్గెట్ Gen Z కాదు, టీవీ జర్నలిస్టులు. ముఖ్యంగా ఇండియా టుడే జర్నలిస్ట్ ప్రీతి చౌదరి చేసిన ఓ వీడియో కంగనా తాజా రియాక్షన్‌కు కారణమైనట్లు కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తన కామెంట్స్‌ను కంగనా సమర్థించుకుంది. అంతేకాదు టీవీ యాంకర్లపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా ఈ చర్చలోకి తీసుకొచ్చింది. అసలు కంగనా తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిందా? లేక కొత్త వివాదానికి తెరలేపిందా?
కంగనా తాజా వీడియోలో ఏముందో చెప్పే ముందు ఒక్కసారి నిన్న ఏం జరిగిందో చూద్దాం. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో Gen Zలోని కొందరిని ఉద్దేశిస్తూ “Generation Gutter” అంటూ కామెంట్ చేసింది. ఇటీవల జరిగిన నిరసనల్లో కొందరు స్టూడెంట్స్ మాట్లాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థుల పెంపకాన్ని కూడా ప్రశ్నించింది. కొన్ని నిరసన వీడియోలు చూస్తే అసహ్యం వేస్తోందని మండిపడింది. అంతేకాదు అమ్మాయిల గురించి కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. కంగనా పోస్టులపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీ ఛానళ్లలో వరుసగా డిబేట్స్ కొనసాగాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తం Gen Zని కంగనా అవమానించిందంటూ చాలామంది మండిపడ్డారు. మరికొందరు మాత్రం ప్రధానిని దారుణంగా తిట్టినవారినే కంగనా టార్గెట్ చేసిందని వెనకేసుకొచ్చారు. కంగనా వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్టుల్లో ఇండియా టుడే జర్నలిస్ట్ ప్రీతి చౌదరి కూడా ఒకరు. ప్రీతి చేసిన ఆ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే కంగనా స్పందించింది. ట్వీట్‌తో కాదు, ప్రెస్‌మీట్‌తో కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి తన వాదనను మరింత గట్టిగా వినిపించింది.
కంగనా ట్వీట్‌తో స్పందించలేదు. రాతపూర్వకంగా కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. ‘Generation Gutter’ వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో పాటు తన మాటలను మీడియాలోని కొందరు కావాలనే వక్రీకరించారని ఆరోపించింది. ముందుగా కంగనా ఏమందో చూద్దాం. తనమీద విమర్శలకు ఇది కంగనా వీడియో సమాధానం. ఆ విమర్శల్లో ఇండియా టుడే ఎడిటర్ ప్రీతి చౌదరి ప్రధాన కారణం. ప్రీతి Xలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో Gen Z మీద కంగనా చేసిన వ్యాఖ్యలను ప్రీతి ప్రశ్నించారు. కొంతమంది బిహేవియర్‌కు మొత్తం ఒక తరం మీదకు ఆపాదించడం సరైంది కాదన్నారు. అలాగే ఓ ఎంపీగా కంగనా అలాంటి భాష వాడటం సమంజసమా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇద్దరి వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మీడియాలోని కొందరు పట్టించుకోకుండా తనమీద ఆరోపణలకు దిగారని కంగనా ఆరోపిస్తోంది. మరోవైపు మొత్తం Gen Zని టార్గెట్ చేయడం కంగనా తప్పేనంటూ ప్రీతి చౌదరి వాదిస్తున్నారు. కంగనా, ప్రీతి ఇద్దరివీ రెండు భిన్నమైన వాదనలు, రెండు వేర్వేరు యాంగిల్స్. అయితే కంగనా తాజా వీడియో తన పాత వ్యాఖ్యలను సమర్థించుకోవడంతోనే ఆగిపోలేదు. ఆ వీడియోలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరో కొత్త రాజకీయ వివాదానికి దారితీశాయి.
Also Read : కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు దిమ్మతిరిగే షాక్!
కంగనా రనౌత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా కంగనా చేసిన కామెంట్స్ జాతీయ స్థాయి వివాదాలకు దారితీశాయి. భారతదేశానికి అసలు స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆ తర్వాతి కాలంలో బీజేపీ ఎంపీ అయిన కంగనా రైతుల ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వ్యాఖ్యలు కంగనా వ్యక్తిగత అభిప్రాయాలేనని, పార్టీ అభిప్రాయం కాదని ఆనాడే బీజేపీ క్లారిటీ ఇచ్చింది. 2024 జూన్‌లో కంగనా మరోసారి వార్తల్లో నిలిచారు. చండీగఢ్ విమానాశ్రయంలో ఓ CISF మహిళా కానిస్టేబుల్ కంగనాను చెంపదెబ్బ కొట్టడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. రైతులపై చేసిన కామెంట్స్ వల్లే కంగనాను కొట్టానంటూ ఆ కానిస్టేబుల్ చెప్పుకొచ్చింది. ఆ ఇష్యూని అన్ని వర్గాలు ఖండించాయి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి కంగనా రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యారు. అయితే ఈసారి వివాదం మరో ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ తో మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో సెల్ఫీ స్టైల్ వీడియోలతో నేటి తరాన్ని నేరుగా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. యువతను ఫ్రెండ్స్ అని సంబోధిస్తున్నారు.
మరోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ కంగనా Gen Zని “Generation Gutter” అంటూ వ్యాఖ్యానించింది. తాజా వీడియోలో ప్రధాని మోదీ తనకు దేవుడితో సమానమని, ఆయనను ఎవరూ తిట్టినా తట్టుకోలేనంటూ బాధపడింది. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు మరో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఈసారి కూడా ఇవి కంగనా వ్యక్తిగత అభిప్రాయాలేనని బీజేపీ చెబుతుందా? గతంలో మాదిరిగా ఆమె వ్యాఖ్యల నుంచి పార్టీ దూరం పాటిస్తుందా? లేక ఈ అంశంపై సైలెంట్‌గా ఉండబోతుందా? ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి కంగనా తాజా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కానీ, బీజేపీ కానీ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు అందరి దృష్టి కంగనా రనౌత్‌పైనే కాదు, కంగనా వ్యాఖ్యలపై బీజేపీ రియాక్షన్‌పై ఉంది. ఏదైతేనేం కంగనా వివాదానికి ఎండ్ కార్డ్ అప్పుడే పడేలా కనిపించడం లేదు.
Also Read : తమిళనాట మరోసారి ‘సినిమా పొలిటికల్’ హీట్.. దళపతి బాటలో యంగ్ హీరోలు!









