
ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కొందరు లక్షలు ఖర్చు పెట్టి మరీ కొనేస్తుంటారు. ఇక ఎప్పటికైనా ఐఫోన్ వాడాలనే కలతో ఇంకొందరు ఉంటారు. అధిక ధర కారణంగా వేలకు వేలు ఖర్చు పెట్టి Iphone కొనుక్కోలేక తెగ బాధపడిపోతుంటారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. iphone 16 పై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ flipkartలో దీనిని అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ iPhone 16 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో పాటు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరింత తగ్గుతుంది. దీని ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
iPhone 16 Price Drop
iPhone 16 ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,900లకు విడుదలైంది. అయితే ఇప్పుడు ఇది flipkartలో కేవలం రూ.67,900 లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ.5,295 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో దీనిని రూ.62,605లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా రూ.49,850 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఒకవేళ ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే.. iPhone 16 మరింత తక్కువ ధరకే లభిస్తుంది. ఇలా డైరెక్ట్ డిస్కౌంట్ రూ.12000, బ్యాంక్ డిస్కౌంట్ రూ.5295, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.49,850 కలుపుకుంటే దీనిని కేవలం రూ.12755లకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 16 Specifications
iPhone 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇందులో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ IP68 రేటింగ్ అందించారు. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. iPhone 16 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.









