
Jharkhand : జార్ఖండ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల నియామకాలలో జరిగిన అక్రమాలకు నిరసనగా విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను వారు తొలగించేందుకు యత్నించడంతో, వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
వీరికి ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతోను అంబులెన్స్‌లోనే పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా, విద్యార్థులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలు పోయినా సీబీఐ విచారణ ప్రకటిస్తేనే వెనక్కి తగ్గుతామని సీఎం హేమంత్ సోరెన్‌కు తేల్చిచెప్పారు. మరోవైపు జెపిఎస్సి పరీక్షల మార్కుల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Also Read : అయోధ్య రామమందిరానికి కొత్త CEO.. రేసులో 18 మంది!
#WATCH | JPSC-JSSC aspirants' protest in Ranchi (Jharkhand) | A student climbs atop Police barricading and dances, as Police use water cannon to disperse student protesters who are taking out a 'Vidhan Sabha Gherao' march. pic.twitter.com/CUKmBLsMDs
— ANI (@ANI) August 10, 2026
అసెంబ్లీ ముట్టడి కారణంగా రాంచీలోని ప్రధాన రహదారులను పోలీసులు మూసివేయడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. భద్రతను మరింత పెంచేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించారు.
#WATCH | JPSC-JSSC aspirants' protest in Ranchi (Jharkhand) | A student climbs atop Police barricading and dances, as Police use water cannon to disperse student protesters who are taking out a 'Vidhan Sabha Gherao' march. pic.twitter.com/CUKmBLsMDs
— ANI (@ANI) August 10, 2026
Also Read : రాంచీలో విద్యార్థుల నిరసన.. మాజీ జేపీఎస్సీ ఛైర్మన్ అరెస్టు!
#WATCH | JPSC-JSSC aspirants' protest in Ranchi (Jharkhand) | Even as Police use water cannon to disperse student protesters, they dance and continue their 'Vidhan Sabha Gherao' march. pic.twitter.com/MlqXDoX3Ta
— ANI (@ANI) August 10, 2026









