
LPG Aadhaar e-KYC : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై లభించే సబ్సిడీని కొనసాగించాలనుకునే వారు 2026 అక్టోబర్ 1లోపు తమ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ (LPG Aadhaar e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి. దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించి నిబంధనల్లో మార్పు చేసింది. దేశీయ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 1 నుంచి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ (KYC) పూర్తిచేసుకున్న వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకే DBT ద్వారా సబ్సిడీ జమ అవుతుందిమీరు గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వ సబ్సిడీ పొందుతున్నట్లయితే, వెంటనే బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను పూర్తి చేసుకోవాలి. లేకపోతే సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు సిలిండర్ కొనాల్సి రావచ్చు. ఈ ప్రక్రియను స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచే చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా ఆథెంటికేషన్ చేయించుకోవచ్చు.
Also Read : తమిళనాడులో మరో రాజకీయపార్టీ…హీరో అజిత్ కార్యదర్శిగా టీఎంకే ?
KYC పూర్తి చేయకపోతే ఏమవుతుంది?
KYC పూర్తి చేయకపోతే మీ LPG కనెక్షన్ Non-KYC కేటగిరీలోకి వెళ్లవచ్చు.
దీంతో:
సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు సిలిండర్ కొనాల్సి రావచ్చు.
LPG సబ్సిడీ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవచ్చు.
మొబైల్ యాప్, Aadhaar FaceRD ద్వారా ఇంటి నుంచే ఆథెంటికేషన్
మీ ఫోన్లోని Google Play Store నుంచి మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. ఉదాహరణకు, ఇండేన్ కోసం IndianOil One, HP Gas లేదా Bharatgas యాప్‌ను ఉపయోగించవచ్చు. అలాగే UIDAIకి చెందిన Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి.
మీ గ్యాస్ కనెక్షన్‌కు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ అవ్వండి.
యాప్‌లోని Profile లేదా Services విభాగంలోకి వెళ్లి Aadhaar e-KYC లేదా Biometric Authentication అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.స్క్రీన్‌పై కెమెరా ఓపెన్ అయిన తర్వాత మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో మీ ముఖాన్ని కెమెరా ముందు ఉంచండి. యాప్ సూచించిన విధంగా కళ్లను రెప్పవేయండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPను నమోదు చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
Also Read : ఉదయం ఈ ఐదు పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీ కిడ్నీలు డేంజర్లో పడినట్లే!
mylpg.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఆథెంటికేషన్
అధికారిక mylpg.in వెబ్సైట్లోకి వెళ్లండి.
కుడివైపు కనిపించే ఇండేన్, భారత్ గ్యాస్ లేదా HP గ్యాస్ సిలిండర్ చిత్రాల్లో మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.
మీ కన్స్యూమర్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లి Biometric Authentication లేదా e-KYC విభాగాన్ని ఎంచుకోండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేయండి. మీ ఆధార్ వివరాలను సరిచూసుకుని, చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
గ్యాస్ డెలివరీ సమయంలోనే ఇంటి వద్ద ఆథెంటికేషన్ చేయించుకోవచ్చు
మీకు ఆన్లైన్ పోర్టల్ లేదా యాప్‌ను ఉపయోగించడం సాధ్యం కాకపోతే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు.
మీ ఇంటికి LPG సిలిండర్ డెలివరీ వచ్చినప్పుడు, డెలివరీ సిబ్బందిని బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయమని అడగవచ్చు.
వారి వద్ద ఉన్న POS మెషీన్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ ఉపయోగించి ఆథెంటికేషన్‌ను పూర్తి చేయవచ్చు.
మొబైల్ నంబర్ లేదా ఆధార్ వివరాల్లో సమస్య ఉంటే?
మీ మొబైల్ నంబర్ మారిపోయి ఉంటే, ఆధార్ కార్డులో పేరు లేదా ఫింగర్‌ప్రింట్ వివరాలు సరిగా లేకపోతే, లేదా ఆన్లైన్ వెరిఫికేషన్ పదేపదే విఫలమవుతుంటే, మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి.
అక్కడ మీ బయోమెట్రిక్ మరియు ఆధార్ వివరాలను ప్రత్యక్షంగా అప్డేట్ చేయించుకోవచ్చు.
అయితే, 27.43 కోట్ల మంది అంటే సుమారు 89 శాతం మంది వినియోగదారులు ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. వారు ఇప్పుడు అదనంగా ఎలాంటి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు.









