
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ poco వచ్చే నెలలో భారతదేశంలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. Poco M8 Power పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకురానుంది. తాజాగా ఈ ఫోన్ ఫీచర్లు విడుదలయ్యాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో Poco M8 Power స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 4న భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్‌లో AMOLED స్క్రీన్ ఉంటుంది. వెనుక కెమెరా యూనిట్‌లో పోకో బ్రాండింగ్‌తో పాటు రెండు కెమెరాలు, ఒక LED ఫ్లాష్ ఉన్నాయి. అలాగే Poco M8 Power స్మార్ట్‌ఫోన్‌లో 8,000 mAh బ్యాటరీ కూడా అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని బ్యాటరీ మూడు రోజుల వరకు పనిచేస్తుందని పోకో వెల్లడించింది.
Also Read : రూ.298లకే షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్.. చలికాలాన్ని వేడిగా చేసేయండి మావా..!
Poco M8 Power స్మార్ట్‌ఫోన్‌ను ఆరెంజ్ కలర్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ కలర్ ఐఫోన్ 17 మోడల్‌ను పోలి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాగా ఇటీవల చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 17 రీబ్రాండెడ్ వెర్షన్ ఇది కావచ్చని కొంతమంది టిప్‌స్టర్స్ తెలిపారు.
అదే సమయంలో Redmi Note 17 కూడా త్వరలో భారతదేశంలో విడుదల కావచ్చని సమాచారం. ఇక ఇటీవల చైనాలో విడుదలైన ఈ ఫోన్ లో 7-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,396 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే అందించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా Redmi Note 17లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్, అడ్రినో GPUతో వంటివి ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమి హైపర్‌ఓఎస్ 3పై నడుస్తుంది.
రెడ్‌మి నోట్ 17 వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p/30 fps వరకు వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇక Redmi Note 17లో 8,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5 W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.
Also Read : SSY పథకం: రోజుకు రూ.50 పొదుపు చేస్తే.. రూ.8.30 లక్షలు మీ సొంతం.. ఇలా చేస్తే చాలు..!









