Prakash Raj :  నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఓటర్ల జాబితా నుండి తన పేరును తొలగించారని అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Also Read : చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్‌.. వైజాగ్ లో కేసు నమోదు!

వీడియోలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… మిత్రులారా, మీకో జోక్ చెప్పాలి. బెంగళూరులో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను కూడా ఒకడిని. జోక్ బాగుంది కదా? నేను పుట్టింది, పెరిగింది, చదివింది, నాటకాలు వేసింది అంతా ఈ ఊరిలోనే. చెప్పాలంటే నేను ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశాను అని చెప్పారు. నా ఓటర్ కార్డు మళ్ళీ రావాలంటే నేను ఏం చేయాలో చూస్తాను. ఓట్లు వేయరనే భయంతో కొందరి ఓటు హక్కును మీరు లాగేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని ఓడించే మా శక్తిని మీరు ఆపగలరా? జస్ట్ అడుగుతున్నాను అంతే అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ చివరిగా డకోయిట్: ఏ లవ్ స్టోరీ, జన నాయగన్, దృశ్యం 3 సినిమాలలో కనిపించారు. వచ్చే ఏడాది రాజమౌళి సినిమా వారణాసి, సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ లో కూడా ఆయన నటిస్తున్నారు.

Also Read : విశ్వనాథ్ అండ్‌ సన్స్‌ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది అంతే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.