Realme C100x
Realme C100x

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఈ వారం భారతదేశంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. Realme C100x పేరుతో దీనిని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. అలాగే ఇది 45 W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 8,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్లు, లాంచ్ తేదీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లోని Realme C100x స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ వివరాలు వెల్లడయ్యాయి. ఇది జూలై 16న విడుదల కానుంది. Realme C100x ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది గోల్డెన్ కోస్ట్, డీప్‌బ్లూ టైడ్స్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది.

Also Read : సగం ధరకే ఈవీ: ఆ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ సబ్సిడీ.. ఓన్లీ ఈ ఫీచర్ వెహికల్స్‌కు మాత్రమే..!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 8,000 mAh బ్యాటరీకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటలకు పైగా ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ట ధర రూ.29,999గా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే Realme C100x ఇండోనేషియాలో విడుదల అయింది. ఇది యూనిసోక్ T7250 ప్రాసెసర్, ఆర్మ్ మాలి-G57 GPUతో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు.

Also Read : అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంపు? చట్ట సవరణకు కేంద్రం సన్నద్ధం