Trisha Krishnan : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన వేడుకల్లో ప్రముఖ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన ఈ వేడుకకు విచ్చేశారమె. సీఎం విజయ్ జెండా ఎగరవేసే సమయానికి ఆమె ముందు వరుసలోని VIP సీట్లో కూర్చుని కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read : మోదీ జీ .. ఐర్లాండ్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారా?.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్!

పసుపు రంగు చీర, తలలో పూలతో చాలా అందంగా కనిపించిన త్రిష, తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు. అక్కడ సిఎం విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌ల పక్కనే త్రిష కూర్చోవడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పరేడ్ జరుగుతున్న సమయంలో ఆమె విజయ్‌కు గౌరవంగా సెల్యూట్ చేస్తూ కనిపించారు. గతంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో కూడా త్రిష మొదటి వరుసలోనే కూర్చున్నారు. ఆ సమయంలో విజయ్ తల్లిని ఆమె ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటోలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి.

ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా విజయ్, త్రిషల స్నేహం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై వారిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి, విజయ్-త్రిషల బంధం గురించి నెటిజన్లలో మళ్లీ కొత్త చర్చ మొదలైంది.

Also Read : ఎన్‌హెచ్‌ఏఐ కొత్త గైడ్‌లైన్స్‌…10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేలు కట్టాల్సిందే..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.