
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని భారీ వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఇనుప వంతెన క్షణాల్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని ఈరోజు (సోమవారం) వరదనీరు ముంచెత్తింది. వరద తీవ్రంగా రావడంతో ఓ ఐరన్ వంతెన క్షణాల్లో కొట్టుకుపోయింది..
The second video from Niti Valley is even more terrifying.
After the reported cloudburst near Tamak, the Valley Bridge built by the BRO was swept away by the sudden surge of water.
The visuals show the raging water carrying away vehicles, with a BRO operator reportedly missing… pic.twitter.com/RCtGYEXKYo
— Kumaon Jagran (@KumaonJagran) August 10, 2026
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీతి వ్యాలీ ప్రాంతంలో ఉన్న నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. నది నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల వైపు ఆ వరదనీరు దూసుకొచ్చింది. నీటితో పాటు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్లు వరదల్లో కొట్టుకువచ్చాయి. ఈ క్రమంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి బలంగా ఢీకొట్టడంతో ఓ ఇనుప వంతెన నీటిలో కొట్టుకుపోయింది. వంతెనకు ఓ వైపున ఉన్న పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.. మరోవైపు ఉన్న ఓ ట్రక్కు, ఎస్‌యూవీ వాహనాదారులు ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే తేరుకుని అక్కడే ఉన్న ఎత్తైన ప్రాంతానికి చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యాన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నిమిషాల వ్యవధిలోనే అవి వైరల్‌గా మారాయి.
#Uttarakhand மாநிலம் சமோலி மாவட்டத்தின் எல்லைப் பகுதியான நிதி பள்ளத்தாக்கில் பெய்த கனமழை மற்றும் மேகவெடிப்பு காரணமாக ஏற்பட்ட திடீர் வெள்ளப்பெருக்கு..
தமக் ஓடையின் மேல் கட்டப்பட்டிருந்த புதிய பெய்லி பாலம் வெள்ளத்தின் அதிவேக சீற்றத்தால் முற்றிலும் அடித்துச் செல்லப்பட்டுள்ளது. pic.twitter.com/lzWOtsww3j
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) August 10, 2026
కాగా, వంతెన కొట్టుకుపోవడంతో నీతి వ్యాలీలోని ప్రాంతాలకు ప్రధాన పట్టణంతో ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు ఈ ప్రాంతంలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దని అధికారులు స్థానికులకు సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో నది నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
Nature’s force is unbelievable!
Today, a sudden surge of water swept away a valley bridge and several vehicles parked nearby, as water and debris rushed through Tamakh village, Niti Valley, Chamoli district, Uttarakhand, near Joshimath, Uttarakhand, India. pic.twitter.com/9Ze2LPn2Em
— Weather Monitor (@WeatherMonitors) August 10, 2026
ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ వివరించారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాల్లో వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులు దెబ్బతినడం, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ఆయన వివరించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.









