
వివో స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ flipkartలో అదిరిపోయే డిస్కౌంట్‌తో Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తగ్గింపుతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. Vivo T3 Ultraలోని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.8వేల తగ్గింపుకే కొనుక్కోవచ్చు. ఇప్పుడు Vivo T3 Ultra ఫోన్ ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్, దాని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
Vivo T3 Ultra Discount Offer
Vivo T3 Ultra మొబైల్ భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.37,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 21% తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపుతో Vivo T3 Ultraను కేవలం రూ.29,999లకే కొనుక్కోవచ్చు. అంటే లాంచ్ ధరపై నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తుంది.
Vivo T3 Ultra Bank Offer
Vivo T3 Ultraపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.28,499కి తగ్గుతుంది. అంటే ఈ ఫోన్ అసలు ధరపై రూ.9,500 తగ్గుతుంది.
Vivo T3 Ultra Specifications
Vivo T3 Ultraలో 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.









