SBI PO recruitment notification
SBI PO recruitment notification

బ్యాంక్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. SBI తాజాగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొత్తం ఖాళీలు: 1500

విభాగాల వారీగా ఖాళీలు:

అన్‌రిజర్వ్డ్‌ 588
ఈడబ్ల్యూఎస్ 144
ఓబీసీ 390
ఎస్సీ 234 (రెగ్యులర్ 216, బ్యాక్​లాగ్ 18)
ఎస్టీ 144 (రెగ్యులర్ 108, బ్యాక్​లాగ్ 36) ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: అభ్యర్థులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. OBCలకు మూడేళ్లు, SC/STలకు ఐదేళ్లు, PWBDలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ : జూన్ 18న ప్రారంభం
దరఖాస్తు లాస్ట్ డేట్: జులై 8.

దరఖాస్తు ఫీసు: అన్‌రిజర్వ్డ్, EWS, OBC అభ్యర్థులకు రూ.750. SC, ST, PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టు 2026.
మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్ 2026.

మరిన్ని విరాలకు వెబ్‌సైట్ ibpsreg.ibps.in/sbipojun26ను సందర్శించండి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.