IND vs ENG 2nd ODI
IND vs ENG 2nd ODI

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 50 ఓవర్లలో 44 ఓవర్లకే 233 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 234 పరుగుల టార్గెట్ ఉంది. భారత్ బ్యాటర్లలో కింగ్ కోహ్లీ (65), శ్రేయాస్ అయ్యర్ (66) పరుగులు చేశారు.

భారత్ ఇన్నింగ్స్

మొదట ఓపెనర్లుగా క్రీజ్ లోకి వచ్చిన రోహిత్, గిల్ మంచి శుభారంబం అందించారు. తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 30 బంతుల్లో ఆరు ఫోర్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బంతి గాల్లోకి లేవడంతో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత రోహిత్ శర్మ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. 47 బంతుల్లో 26 పరుగులు చేసిన రోహిత్ పెవిలియన్‌కు చేరాడు.

ఇక కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 1 పరుగుకే సామ్ కర్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస వికెట్లు పడుతున్నా మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో పరుగుల వరద పెట్టించాడు. వరుసగా ఫోర్లతో అదరగొట్టాడు. అనంతరం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కోహ్లీ 65 పరుగులు చేసి ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన సుందర్ 2 పరుగులు, అక్షర్ పటేల్ 1పరుగు, శివమ్ దూబె డకౌట్ అయ్యారు. ఇక శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సాకిబ్ మహమూద్ రెండు వికెట్లు తీయగా, విల్ జాక్స్, సామ్ కర్రన్ చెరో వికెట్ తీసుకున్నారు.