
Virat Kohli : భారత మాజీ కెప్టెన్, టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందని తేల్చేశారు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్.. తను దేశం తరఫున ఆడే చివరి మెగా టోర్నీ అని తేల్చి చెప్పారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా చేసిన ప్రకటనతో వన్డేలకు సైతం గుడ్ బై చెప్పనున్నాడనే విషయం తేలిపోయింది.
Also Read : సెప్టెంబర్ 30న ఢిల్లీలో INDIA కూటమి భేటీ.. అజెండా ఇదే!
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ తన చివరి ఐసీసీ టోర్నీ అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ కొట్టడమే తన ప్రధాన లక్ష్యమని కూడా వెల్లడించారు. ఆ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు మైదానంలో తన సర్వశక్తులూ ధారపోస్తానని అన్నారు. ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నెల 27 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా “జియోస్టార్’తో కోహ్లీ మాట్లాడుతూ పలు విషయాలువెల్లడించారు. కాగా, వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుండడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘2027 వన్డే ప్రపంచ కప్.. భారత్ తరఫున నేను ఆడబోయే చివరి ఐసీసీ టోర్నీ కానుంది. మైదానంలో నా శక్తినంతా ధారపోసి ఆడుతా. ఎలాగైనా ఈ ప్రపంచ కప్ గెలిచి తీరాల్సిందే. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’ అని కోహ్లీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంకా మాట్లాడుతూ వన్డే ప్రపంచకప్‌లో ఉండే ఇంటెన్సిటీ మరే ఇతర టోర్నమెంట్‌లోనూ ఉండదని కోహ్లీ అన్నాడు. ‘‘ఇందులో దాదాపు 10 మ్యాచ్‌లను టీ20 స్థాయి తీవ్రతతో ఆడాల్సి ఉంటుందన్నారు. ఒక వన్డే మ్యాచ్ అనేది 2.5 టీ20లతో సమానం అన్నారు. పెద్ద టోర్నమెంట్ లేదా ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లపాటు ఆ ఇంటెన్సిటీని కొనసాగించడం చాలా పెద్ద విషయం.’’ అని కోహ్లీ వివరించారు. కాగా. 2027 ప్రపంచకప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనుండగా ఇది కోహ్లీకి నాలుగో వన్డే ప్రపంచకప్ కానుంది..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విరాజ్ కోహ్లీ అద్బుత ప్రదర్శన కనపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన12 వన్డేల్లో 76 సగటుతో 760 పరుగులు సాధించగా. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉండటం విశేషం. 2025 ఆరంభం నుంచి చూస్తే 64.68 సగటుతో 1,035 పరుగులు చేశాడు. ఇక గత 10 వన్డేల్లో మూడు శతకాలు సహా ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
Also Read : అవినీతి చేసిన వారిని వదిలేది లేదు.. విజయ్ సంచలన వ్యాఖ్యలు!









