
The Paradise : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర జడల్ జమానా దూకుడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ (Worldwide Gross) రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
Also Read : హీరో భార్యకు నేను నచ్చలేదట.. అందుకే సినిమా నుంచి తీసేశారు: తాప్సీ
#TheParadise collects 114 CRORES+ GROSS WORLDWIDE in 2 days
Natural Star @NameisNani in an @odela_srikanth cinema
An @anirudhofficial musical pic.twitter.com/lH96x8ib0s— Vamsi Kaka (@vamsikaka) September 26, 2026
ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ రూ.88 కోట్ల గ్రాస్ న నమోదు చేసింది.నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా ప్యారడైజ్ నిలవడం గమనార్హం. ఓవర్సీస్లోనూ ప్యారడైజ్‌కు అదిరిపోయే కలెక్షన్లు వస్తు్న్నాయి.నార్త్ అమెరికాలో $1.7 మిలియన్+ గ్రాస్ నమోదైంది. దీంతో $2 మిలియన్ క్లబ్‌పై ప్యారడైజ్ కన్నేసింది.హిందీ, తమిళ మార్కెట్ల నుంచి కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. వీకెండ్ కావడంతో బుక్ మై షోలోనూ భారీ బుకింగ్స్ చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పలు థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.త్వరలో రూ.500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా..కలెక్షన్లలో మాత్రం తగ్గేదేలే అంటున్న నాని ప్యారడైజ్ చిత్రం.
గతంలో నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇది వారి రెండో సినిమా కావడం, దానికి తోడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నాని మాస్ పెర్ఫార్మెన్స్కు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. వారం రోజులు ముగిసేసరికే ఈ సినిమా మరిన్ని భారీ మైలురాళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read : ఇంత విషం ఇవ్వండి చచ్చిపోతా.. జైల్లో వేధిస్తున్నారు : పవిత్రా గౌడ కన్నీళ్లు!









