Dr. Priyanka : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కారుతో గుద్దడంతో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్‌ ప్రియాంక చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. రాజమండ్రిలో ఈ నెల 3న తీవ్రంగా గాయపడిన ప్రియాంకను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.ఈనెల 3న AVA రోడ్డులోని ప్రసాద్ ఆదిత్య మాల్ కు సినిమా చూడడానికి వెళ్లిన ప్రియాంకను మద్యం మత్తులో ఉన్న నిందితులు దస్వంత్, అండ్రూ జోసెఫ్ కారుతో గుద్దారు. ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కించి పరార్ అయ్యారు. తీవ్రగాయాలతో బ్రెయిన్‌ డెడ్ అయి.ఆస్పత్రిలో చేరిన ప్రియాంక 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది.ఈ మేరకుప్రియాంక చనిపోయినట్లు కిమ్స్ డాక్టర్లు ప్రకటించారు.

కాగా,డాక్టర్‌ ప్రియాంక కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రియాంకకు యాక్సిడెంట్ జరిగి 5 రోజులు అయినప్పటికీ పోలీసులు 4 రోజుల వరకు విషయం బయటకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులపై కేసు పెట్టి, చేతులు దులుపుకున్న పోలీసులు విమర్శలు రావడంతో ఇవాళ నిందితుల్ని అరెస్ట్ చేశారు.ప్రియాంక బ్రెయిన్‌డెడ్‌కు కారణమైన కారు ఎవరిది? కారు నంబర్ ప్లేట్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఇప్పటివరకు FIR ఎందుకు బయటపెట్టడం లేదు? కేవలం యాక్సిడెంట్ కేసుగానే సెక్షన్స్ ఎందుకు పెట్టారు?నిందితుల్ని మీడియాకు చూపించకుండానే..హడావుడిగా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారు? బండి నడిపిన మరో మెడికోని ఎందుకు సైలెంట్ చేశారు? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుల్ని కాపాడుతోంది ఎవరు? ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన అధికార పార్టీనేత పాత్ర ఏంటిదనే ప్రశ్నలను పలువురు సంధిస్తు్న్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Also Read : అస్సాంలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై అత్యంత దారుణంగా

అసలేం జరిగిందంటే…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సినిమా చూసి మాల్ నుండి స్కూటీపై బయటకు వస్తున్న మెడికల్ విద్యార్థిని ప్రియాంకపై నిందితులు కారు ఎక్కించారు. ఈ ఘటనలో ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. 28 ఏళ్ల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 3న రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌ లో సినిమా చూసి తర్వాత ఆమె స్కూటీపై ఇంటికి వెళ్లేందుకు బయటకు వస్తున్నారు. అదే సమయంలో అమెవెనుక కారులో ఉన్న ఇద్దరు యువకులు వెనుక నుంచి వేగంగా వచ్చి ఆమె స్కూటీని ఢీట్టారు. దీంతో డాక్టర్ ప్రియాంక రోడ్డుపై పడిపోయింది. అయినప్నపటికీ ఏమాత్రం కనికరం లేకుండా కారు ఆమె తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయారు . తీవ్ర తలగాయాలతో పడిఉన్న ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ కిమ్స్‌ కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించి బ్రెయిన్‌డెడ్‌గా మారినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఉన్న నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : హనుమకొండలో దారుణం.. భార్య కాళ్లూ చేతులు కట్టేసి హత్య!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.