Telangana Girl : అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని నల్లగొండకు చెందిన యువతి మాన్విత రెడ్డి అమెరికాలో మృతి చెందింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మాన్విత రెడ్డి కొంతకాలంగా తల, మెడకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతుంది. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. వైద్యులు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సను అందిస్తూ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యాధితో పోరాడిన మాన్విత పరిస్థితి క్రమంగా విషమించింది. ఎంత చికిత్స చేసినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి ఆమె మృతి చెందారు.

Also Read : రోజుకు రూ.400.. నెలకు రూ.8,500.. మెట్రో, బస్సులకు కామన్ పాస్

మాన్వితకు చికిత్స జరుగుతున్న సమయంలో అమెరికాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు అండగా నిలిచారు. ఆమెతోనే ఉంటూ అవసరమైన సహాయం చేశారు. అయితే ఎంత ప్రయత్నించినా మాన్వితను కాపాడలేకపోయారు. ఆమె మృతితో తెలంగాణలోని కుటుంబ సభ్యులు, అమెరికాలోని బంధువులు తీవ్రంగా బాధపడుతున్నారు.

కాగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కందిమల్ల లక్ష్మారెడ్డి-పద్మ దంపతుల కుమార్తె మాన్వితా రెడ్డి (27). హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ అనంతరం ఉన్నత విద్య కోసం మూడేళ్ల క్రితమే అమెరికా వెళ్లారు. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ సమీపంలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు.

Also Read : రాజస్థాన్‌తో ఒప్పందం రద్దు చేసుకోండి.. ప్రభుత్వానికి హరీశ్‌రావు డిమాండ్‌

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.