
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ మ్యాగజైన్ మాజీ కాలమిస్ట్ ఇ. జీన్ క్యారల్పై ఆయన లైంగిక దాడికి పాల్పడటం నిజమేనని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు తేల్చింది. ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అమెరికా దేశ రాజకీయ చరిత్రలోనే ఒక దేశ అధ్యక్షుడిపై లైంగిక దాడి కేసులో నేరం రుజువు కావడం, కోర్టు ఇలా శిక్ష ఖరారు చేయడం ఇదే మొదటిసారి. ఈ సివిల్ కేసును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.41 కోట్లు ఉంటుంది.
Also Read : అమెరికా బాంబుల దాడిలో ధ్వంసమైన ఖమేనీ కాంపౌండ్.. విధ్వంస దృశ్యాలను విడుదల చేసిన ఇరాన్
కేవలం లైంగిక వేధింపులకే కాకుండా, ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా ట్రంప్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. అయితే ఈ వివాదం దశాబ్దాల నాటిది. 1996వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని ఒక లగ్జరీ డిపార్ట్మెంటల్ స్టోర్ చేంజింగ్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని జీన్ క్యారల్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ మొదటి నుంచి పూర్తిగా ఖండిస్తూనే వచ్చారు. ఆమె ఎవరో అసలు తనకు తెలియదని, కేవలం తన రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీయడానికి, పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోందని ట్రంప్ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. కానీ విచారణలో జ్యూరీ సభ్యులు క్యారల్ వైపే మొగ్గు చూపారు.
ఈ కేసు విచారణ సమయంలో ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు, బాధితురాలు సమర్పించిన ఆధారాలు చట్టబద్ధంగా నిజమేనని నిర్ధారించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె సమాజంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారని స్పష్టం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని తక్షణమే డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు అమెరికా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ట్రంప్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన లీగల్ టీమ్ వెల్లడించింది.
Also Read : పవిత్ర కర్బలా నగరంలో కన్నీటి సముద్రం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు నేడే!









