
Donald Trump : ఇరాన్, అమెరికాల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒకవైపు చర్చలు అంటూ చెప్తూనే మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వివాదం పరిష్కారం కోసం ఏ దేశం కూడా సుముఖంగా ఉన్నట్లు అనిపించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ముందు మరో కొత్త డిమాండ్‌ను పెట్టాడు. ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని ట్రంప్ కొత్త డిమాండ్ ముందుకు తెచ్చాడు.
Also Read : ఒక్కటైన సౌదీ, పాక్, తుర్కియే.. భారత్‌కు తీవ్ర ముప్పు..
యుద్ధ విరమణ కోసం ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. గత 50 సంవత్సరాలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తల మూలంగా జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాలని ట్రంప్ డిమాండ్ చేయడం చర్చనీయంశంగా మారింది. ఇరాన్ మూలంగా సంభవించించిన మరణాలు, యుద్ధాలు, దాడులు, ఇతర నష్టాలకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రంప్ గట్టిగానే పట్టుపడుతున్నారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా సాగించిన యుద్ధం మూలంగా తాము కూడా తీవ్రంగా నష్టపోయామని చెబుతూ అమెరికా నుంచి పరిహారం కోరింది. అమెరికా చేసిన సైనిక చర్యలకు పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేసింది. మరోవైపు తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని కూడా ఇరాన్ కోరుతోంది. ఇక, శాంతి చర్చల్లో హోర్ముజ్‌ను తిరిగి తెరవడం కీలకంగా మారిన విషయం తెలిసిందే.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే తమ షరతులు అంగీకరించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని ఇరాన్ అమెరికా ముందు ప్రస్తావిస్తోంది. ఇటు ఇరాన్, అటు ట్రంప్ పరిహారం కోసం పట్టుబడుతుండటంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన చర్చలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
Also Read : కొలంబియాలో భారీ భూకంపం : 111 మంది మృతి.. శిథిలాల కింద నివాసితులు!









