
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌లో దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకకు అమెరికాలోని ప్రముఖ ఇండియన్-అమెరికన్స్, యూఎస్‌లోని భారత రాయబారి వినయ్ క్వాత్రా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో ఒక ప్రత్యేకమైన సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ భారతీయ టెక్ ఎంట్రప్రెన్యూర్, GOQii ఫౌండర్ విశాల్ గోండల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి ‘హనుమాన్ చాలీసా’ ప్రతిని గిఫ్ట్‌గా అందించారు. భారతదేశం మరియు అమెరికా మధ్య ఉన్న బలమైన ఫ్రెండ్షిప్కు ఇది ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
Also Read : ట్రంప్‌ను ఓడించిన ఇండియన్స్.. ఎందుకంటే?
ఈ స్పెషల్ మీటింగ్ తాలూకు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విశాల్ గోండల్ భావోద్వేగంగా స్పందించారు. “ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఆయనకు హనుమాన్ చాలీసా బహూకరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. దీపాలు వెలిగిస్తున్న సమయంలో భారత్, యూఎస్ మధ్య స్నేహం మరింత బలపడాలని, చీకటిపై వెలుగు సాధించే విజయానికి గుర్తుగా నేను ప్రార్థించాను” అని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు అమెరికా వ్యాప్తంగా కూడా దీపావళి వెలుగులు విరజిమ్మాయి. చరిత్రలోనే తొలిసారిగా అమెరికాలోని ఐదు రాష్ట్రాల గవర్నర్లు అధికారికంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. నార్త్ డకోటా, వాషింగ్టన్, ఒరెగాన్, నెబ్రాస్కా, ఐడహో రాష్ట్ర రాజధాని భవనాలు మరియు గవర్నర్ల నివాసాల్లో ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరిగాయి.
ఈ ఈవెంట్స్‌లో 20 మందికి పైగా సిటీ మేయర్లు, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ మెంబర్లు మరియు పెద్ద సంఖ్యలో ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ఎకనామిక్, సోషల్ మరియు కల్చరల్ డెవలప్మెంట్లో ఇండియన్ అమెరికన్లు పోషిస్తున్న పాత్రను గవర్నర్లు ప్రత్యేకంగా ప్రశంసించారు. అగ్రరాజ్యంలో భారతీయ సంస్కృతికి, పండుగలకు లభిస్తున్న ఈ గుర్తింపు ప్రవాస భారతీయుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
Also Read : అమెరికా రాజకీయాల్లో హైదరాబాదీ అమ్మాయి.. 27ఏళ్లకే సెనేటర్‌గా









